Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఆర్‌సీబీకి దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్.. కేదార్ జాదవ్ ఇన్!

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే రజత్ పటీదార్, విల్ జాక్స్, రీస్ టోప్లీ తీవ్ర గాయాలతో టోర్నీకి దూరమవ్వగా.. తాజాగా డేవిడ్ విల్లే కూడా ఈ జాబితాలో చేరాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్ విల్లే పాదానికి బలమైన గాయమైంది.

దాంతో అతను ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో అతని స్థానాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్‌తో భర్తీ చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ మినీవేలంలో కేదార్ జాదవ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

Kedar Jadhav

దాంతో అతను అన్ సోల్డ్ లిస్ట్‌లో చేరిపోగా.. మిడిలార్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్‌ను ఆర్‌సీబీ ఎంపిక చేసింది. డేవిడ్ విల్లే స్థానాన్ని ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హజెల్‌వుడ్‌తో భర్తీ చేయనుంది.

చీల మండ గాయంతో ఫస్టాఫ్ టోర్నీకి దూరమైన హజెల్‌వుడ్ పూర్తిగా కోలుకున్నాడు. ఇక కేదార్ జాదవ్ రిప్లేస్‌ మెంట్‌కు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసారు.

'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులో కీలక మార్పు జరిగింది. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ విల్లే స్థానాన్ని వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్‌తో భర్తీ చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి మైడే వికెట్లు తీసాడు.

2010లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్ ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1196 పరుగులు చేశాడు. గతంలో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన జాదవ్..ఆ జట్టు తరఫున 17 మ్యాచ్‌లు ఆడాడు. అతన్ని కోటీ రూపాయల ధరకు ఆర్‌సీబీ తీసుకుంది.

Story first published: Monday, May 1, 2023, 17:40 [IST]
Other articles published on May 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+