For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆ జాబితాలో ఆర్‌సీబీనే టాప్!

IPL 2023: RCB is the most popular Indian sports team on Instagram in October 2022

హైదరాబాద్: భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అత్యంత పాపులర్ టీమ్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 15 ఏళ్లుగా ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆ జట్టు అభిమానుల సంఖ్య పెరిగిందే తప్పా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఈ క్రేజ్‌కు ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బెంగళూరు నగరానికి ఆర్‌సీబీ నేతృత్వం వహిస్తున్నా.. దేశవ్యాప్తంగా ఆర్‌సీబీకి అభిమానులన్నారు. విరాట్ కోహ్లీని అభిమానించే ప్రతీ ఒక్కరు ఆర్‌సీబీని ఇష్టపడుతారు.

ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆర్‌సీబీ టైటిల్ గెలవకపోయినా.. అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గకుపోగా.. మరింత పెరుగుతోంది. ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఆర్‌సీబీకే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన టాప్-5 జట్లలో ఆర్‌సీబీ అగ్రస్థానంలో ఉంది. అక్టోబర్ 2022కు సంబంధించిన ఈ వివరాలను డిపోర్టర్స్ అండ్ ఫినాంజస్ అనే సంస్థ వెల్లడించింది.

ఈ వివరాల ప్రకారం ఆర్‌సీబీకి 59.6 మిలియన్ల ఫాలోవర్లతో మోస్ట్ పాపులర్ టీమ్‌గా నిలవగా.. 34.4 మిలియన్ల ఫాలోవర్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 32.2 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉండగా.. ఐఎస్‌ఎల్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ 24.7 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్ 8.62 మిలియన్లతో టాప్-5లో చోటు దక్కించుకుంది.

ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఆర్‌సీబీ తమ కోర్ టీమ్‌ను అలానే కొనసాగించింది. గతేడాది ముంబై ఇండియన్స్‌ నుంచి ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న జాసన్ బెహ్రెండార్ఫ్‌ను మళ్లీ ఆ జట్టుకే ఇచ్చేసింది. జాసన్ బెహ్రండార్ఫ్‌తో పాటు విండీస్ ప్లేయర్ షెర్ఫానే రుదర్ ఫోర్డ్‌ను వదిలేసింది. హైదరాబాద్ క్రికెటర్ చామ మిలింద్‌తో పాటు ఇతర దేశవాళీ క్రికెటర్లు అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియాలను రిలీజ్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ దగ్గర రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలాయి.

ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, వానిందు హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, కరన్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్

ఆర్‌సీబీ వదిలేసిన ఆటగాళ్లు..
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామ మిలింద్, లువినిత్ సిసోడియా, షెఫ్రానే రూదర్‌ఫోర్డ్

Story first published: Friday, November 18, 2022, 20:24 [IST]
Other articles published on Nov 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+