IPL 2023: రూ. 900 కోట్లు ఖర్చు చేసిన ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్.. ఎందుకంటే?

హైదరాబాద్: భారత క్యాష్ రిష్ లీగ్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీలనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత భారత క్రికెట్‌కు మూల స్థంభాలైన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభం నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నాడు. 14 ఏళ్లుగా జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమైన అతను గతేడాది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఆర్‌సీబీ.. ఫాఫ్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. అయినా ఆ జట్టు రాత మారలేదు. మరోసారి ప్లే ఆఫ్స్‌కే పరిమితమై ఇంటిదారి పట్టింది.
ఆటగాళ్ల కోసం రూ.900 కోట్లు
మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం లీగ్‌లోనే అత్యధికంగా ఐదు టైటిళ్లు గెలిచింది. కానీ గత సీజన్‌లో ఆ జట్టు దారుణంగా విఫలమైంది. ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్ల కోసం ఏకంగా రూ.900 కోట్లు ఖర్చు చేశాయి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచక్రికెట్‌నే శాంసించే స్థాయికి ఎదిగింది. ఐపీఎల్ జరిగినన్ని రోజులు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆగిపోతుంది.

విరాట్ కోహ్లీ ఒక్కనికే రూ. 158.2 కోట్లు..
అంతటి పవర్ ఫుల్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆయా జట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుల వివరాలు మనీబాల్ సంస్థ ప్రకటించింది. 2008 నుంచి 2022 వరకు మొత్తం 15 సీజన్లలో ఆర్‌సీబీ ఆటగాళ్ల కోసం రూ.910.5 కోట్లు ఖర్చు చేసి ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇందులో విరాట్ కోహ్లీ ఒక్కడే 158.2 కోట్లు తీసుకున్నాడు. గత సీజన్‌లో రూ.15 కోట్లకు తగ్గిన విరాట్.. అంతకుముందు వరకు రూ.17 కోట్లు తీసుకున్నాడు. పది ఫ్రాంచైజీల్లో ఆర్‌సీబీ ఒక్కటే రూ.910.5 కోట్లు ఖర్చు చేసింది.
ముంబై సెకండ్..
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఐదు టైటిళ్లు గెలిచిన అంబాని టీమ్ ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 884.5 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్ రూ.852.5 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.826.6 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ రూ.778.3 కోట్లతో ఐదో స్ధానంలో ఉండగా.. రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ రూ.761.1 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

ఆరెంజ్ ఆర్మీ రూ.647 కోట్లు..
ఇక మధ్యలో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.646.9 కోట్లు ఖర్చు చేసింది. రాజస్థాన్ రాయల్స్ రూ.613.3 కోట్లు ఖర్చు చేయగా.. గతేడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్రో సూపర్ జెయింట్స్ రూ.89.2 కోట్లు, టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ రూ.88.3 కోట్లు ఆటగాళ్లకు వేతనాలుగా చెల్లించింది. ఆటగాళ్ల జీతాల విషయంలో టాప్‌లో నిలిచిన ఆర్‌సీబీ.. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ ద్వారా కోట్ల వ్యాపారం జరగుతుందనేదానికి ఇది ఒక నిదర్శనమని, ఆటగాళ్లకే వేల కోట్లు ఖర్చు అయితే.. ఇతర విషయాల ద్వారా ఎంత బిజినెస్ అవుతుందో ఊహించుకోవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications