Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఆర్‌సీబీకి రాజస్థాన్ గండం.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏం చేయాలి?

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టోర్నీలో ముందడుగు వేయనుండగా.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ, కేకేఆర్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం ముంబై, లక్నో, రాజస్థాన్, ఆర్‌సీబీ పోటీపడుతున్నాయి. ఇందులో ముంబై కూడా దాదాపు తమ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. నాలుగో ప్లేస్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది.

RCB RR Match

12 మ్యాచ్‌ల్లో 6 గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆర్‌సీబీ కంటే ముందుండగా.. 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఆర్‌సీబీ 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినా.. ఆర్‌సీబీ ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి. ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌ గెలవడంతో పాటు తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనూ విజయం సాధించాలి. మాములుగా గెలవడమే కాకుండా భారీ విజయాలు అందుకోవాలి. మెరుగైన రన్‌రేట్ ఉంటేనే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలుంటాయి.

ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒక్కటి ఓడినా ఆ జట్టు అవకాశాలు దెబ్బతింటాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆర్‌సీబీ గత రెండు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలను కాపాడుకోలేక ఓటమిపాలవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయంతో జోరు మీద ఉంది.

ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మూడు వరుస పరాజయాల తర్వాత కేకేఆర్‌ను మట్టికరిపించిన రాజస్థాన్.. అదే జోరులో ఆర్‌సీబీని ఓడించాలనుకుంటోంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఆర్‌సీబీలో అనూజ్ రావత్ స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్‌ను తీసుకోవచ్చు.

తుది జట్లు(అంచనా)

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్(కీపర్), అనూజ్ రావత్/షెహ్‌బాజ్ అహ్మద్, కేదార్ జాదవ్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, వైశాఖ్ విజయ్‌కుమార్, జోష్ హజెల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్

రాజస్థాన్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, జోరూట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, కేఎమ్ ఆసిఫ్

Story first published: Sunday, May 14, 2023, 6:10 [IST]
Other articles published on May 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+