For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఆర్‌సీబీకి గట్టి షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు గ్లేన్ మ్యాక్స్‌వెల్ డౌట్!

IPL 2023: RCB allrounder Glenn Maxwell likely to miss Upcoming season

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అప్‌కమింగ్ సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లిన మ్యాక్స్‌వెల్.. అక్కడ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో అతని కాలి ఎముక విరిగింది. దాంతో ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ గాయం కారణంగానే బిగ్‌బాష్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే వైద్యులు గాయం రికవరీ కావడానికి 3-4 నెలలు పడుతుందని సూచించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి మ్యాక్సీ దూరమయ్యే అవకాశాలున్నాయి.

తాజాగా అతనే తన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించాడు. ఈ ప్రమాదంలో తన పాదాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నాడు. ఆరంభంలో నడవడం కూడా చాలా కష్టంగా ఉండేదని చెప్పాడు. నెమ్మదిగా గాయం నుంచి కోలుకుంటున్నానని చెప్పిన మ్యాక్సీ.. తన సతీమణి వినీ ఇస్తున్న సపోర్ట్ మాటల్లో చెప్పలేనిదని తెలిపాడు.

IPL 2023: RCB allrounder Glenn Maxwell likely to miss Upcoming season

ఓ నర్స్‌గా అన్ని సపర్యలు చేస్తున్న ఆమె.. గాయం పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. ఈ గాయం కారణంగా 5 కిలోల బరువ తగ్గానని చెప్పిన మ్యాక్సీ.. ప్రతీ నిమిషాన్ని గాయం రికవరీ కోసమే ఉపయోగిస్తున్నానని తెలిపాడు. ఏప్రిల్ ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.

అయితే మార్చి-జూన్ విండోలో ఐపీఎల్ 2023 సీజన్ జరగనుండగా.. మ్యాక్సీ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మాములు మనిషిలా ఆడేందుకు చాలా టైమ్ పడుతోంది. ఒకవేళ అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా.. మునపటిలా ఆడుతాడో లేదో కూడా అనుమానమే. ఏది ఏమైనా.. మ్యాక్సీ అనూహ్య గాయం బెంగళూరుకు కోలుకోలేని దెబ్బే.

Story first published: Tuesday, December 27, 2022, 14:36 [IST]
Other articles published on Dec 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+