Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఊ అంటావా మామ అంటూ ఊపేసిన తమన్నా, రష్మికా!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు.. తెలుగు ఆల్‌టైమ్ హిట్ మూవీస్ పుష్ప, ట్రిపుల్ ఆర్ సాంగ్స్‌తో దద్దరిల్లాయి. ఊ అంటావా మావా అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులను ఊపేయగా.. 'నీ పెళ్లాన్ని అయిపోతా సామీ' అంటూ రష్మిక మంధన్నా ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈ ఇద్దరూ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు' పాటతో వేడుకలను మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తెలుగు సాంగ్స్ భాగమవ్వడం పట్ల తెలుగు అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.

rashmika mandanna performing at ipl 1

ఈ ఆరంభ వేడుకలకు మందిరా బేడీ హోస్ట్‌గా వ్యవహరించగా.. సింగర్ అర్జిత్ సింగ్ తన పాటతో వేడుకలను ప్రారంభించాడు. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఓపెన్ టాప్ కారులో పాట పాడుతూనే మైదానం చుట్టూ తిరిగిన అర్జిత్ సింగ్.. తన గాత్రంతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత సౌతిండియా స్టార్ తమన్నా భాటియా.. తన డ్యాన్స్‌తో కనువిందు చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్స్‌లో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్‌కు చిందేసింది. పుష్పా సాంగ్ 'ఊ అంటావా మావా ఊ అంటావా'తో అభిమానులను ఊపేసింది.

ఆ తర్వాత రష్మిక మంధాన్న హాయ్ చెబుతూ.. గుజరాత్, చెన్నై జట్ల అభిమానులను పలకరించింది. పుష్ప హిట్ సాంగ్.. సామీ సామీ సాంగ్‌తో రష్మిక అదరగొట్టింది. ఆ తర్వాత తమన్నాతో కలిసి నాటు నాటు పాటకు చిందేసింది. ఈ పాటతో వేడుకలకు ముగియగా.. హోస్ట్ ఇందిరా బేడీ బీసీసీఐ అధికారులను వేదికపైకి ఆహ్వానించింది.

బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వేదికపైకి వచ్చారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా స్పెషల్ వెహికిల్‌లో స్టేజిపైకి వచ్చాడు.

ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా గుజరాత్ సంప్రదాయక నృత్యంతో టైటిల్‌ను స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు. అనంతరం మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను ప్లే చేశారు.

Story first published: Friday, March 31, 2023, 19:11 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+