IPL 2023: డారిల్ మిచెల్‌తో పాటు ఆ ఇద్దరిని వదిలేయనున్న రాజస్థాన్ రాయల్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ తృటిలో చేజార్చుకుంది. అరంగేట్ర సీజన్ తర్వాత మళ్లీ 15 ఏళ్లకు అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన రాజస్థాన్.. లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఛాంపియన్‌గా నిలిచే బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో సమతూకంగా కనిపించిన రాజస్థాన్.. కీలక ఫైనల్లో చెత్త ప్రణాళికలతో మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఆ జట్టు కొంపముంచింది. సీజన్ అసాంతం జట్టులోని ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ క్రమంలోనే అప్ కమింగ్ సీజన్‌లో జట్టును మరింత బలంగా మార్చడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు ఆటగాళ్లను వదిలేయాలనుకుంటుంది.

జిమ్మీ నీషమ్..
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్.. అతని ఐపీఎల్ కెరీర్‌లో చాలా వరకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌కు ముందు వరకు ముంబైకి ఆడిన అతను.. తుది జట్టులో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. ఈ సారి మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేయగా.. టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కలేదు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ కివీస్ ఆల్‌రౌండర్ 31 రన్స్ మాత్రమే చేసి విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కూడా అంతగా ప్రభావం చూపలేదు. ఇక రాజస్థాన్ ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్‌లను ఫినిషర్లుగా వాడుకుంటుంది. ఈ క్రమంలోనే జిమ్మీ నీషమ్ అవసరం జట్టుకు లేకుండాపోయింది. దాంతో అతన్ని ఆ జట్టు వదిలేయాలనుకుంటుంది.

డారిల్ మిచెల్..
మరో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ సైతం ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో మిచెల్‌ను తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. అతనిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ అతని అరంగేట్ర సీజన్‌లో మిచెల్ 75 స్ట్రైక్‌రేట్‌తో 33 పరుగులు మాత్రమే చేసాడు. దాంతో అతన్ని పక్కటన పెట్టాలని జట్టు భావిస్తోంది. అతనికి బదులు మంచి టాపార్డర్ బ్యాటర్‌ను తీసుకోవాలనుకుంటుంది.

నవ్‌దీప్ సైనీ..
టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీని రూ.2.6 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. కానీ అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి రెండు వికెట్లు తీసాడు. సూపర్ డైవ్‌తో క్యాచ్ పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు. ఆ తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రాజస్థాన్ జట్టులో ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్‌తో బౌలింగ్ లైనప్ బలంగా ఉండటంతో నవ్‌దీప్ సైనీని వదిలేయాలని ఆ జట్టు భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications