Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఇక వైడ్ బాల్, నోబాల్‌కు రివ్యూ తీసుకోవచ్చు.. నయా రూల్స్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!

IPL 2023: Players can review wides and no-balls using DRS

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త నిబంధనను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆటగాళ్లు రివ్యూ తీసుకనే అవకాశం కల్పించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ నిబంధనను బీసీసీఐ.. వుమెన్స్‌ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లో ప్రవేశ పెట్టింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో ఈ నిబంధనను ఉపయోగించుకొని ఆయా జట్లు లబ్దిపొందాయి.

వైడ్, నోబాల్ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు..

వైడ్, నోబాల్ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు..

యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూపీ ప్లేయర్ గ్రేస్ హారీస్ వైడ్ బాల్ కోసం రివ్యూ కోరి ఎక్స్‌ట్రా పరుగు సాధించింది.మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో యూపీ వారియర్స్ విజయానికి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన దశలో గ్రేస్ హారీస్ వాడిన ఈ డీఆర్‌ఎస్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అలాగే ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీసీ ప్లేయర్.. నో బాల్ కోసం డీఆర్‌ఎస్ రివ్యూ కోరింది.

ఇప్పుడు ఇదే నిబంధనను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్‌లోనూ అమలు చేయాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే లెగ్ బైస్‌గా ప్రకటించిన పరుగుల విషయంలో మాత్రం రివ్యూ తీసుకునే అవకాశం లేదు.

 ఇంపాక్ట్ రూల్‌తో..

ఇంపాక్ట్ రూల్‌తో..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అప్‌కమింగ్ సీజన్‌లో అమలు చేయనుంది. ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌గా ఆడించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండటమే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉద్దేశం. మ్యాచ్ జరుగుతుండగా.. ఫోర్త్ అంపైర్ లేదా.. ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడంతో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. ఇప్పటికే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను ప్రయోగత్మకంగా బీసీసీఐ అమలు చేసింది.

గత సీజన్ వివాదాలతో..

గత సీజన్ వివాదాలతో..

గత సీజన్ ఐపీఎల్‌లో వైడ్ బాల్స్ విషయంలో అంపైర్లు చేసిన తప్పులు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అంపైర్‌పై అసహనంతో రివ్యూ కోరినట్లు సైగ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అప్పుడే వైడ్ బాల్‌కు కూడా రివ్యూ తీసుకునే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైంది.

ఆ తర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ వైడ్ ఇవ్వలేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, అసిస్టెంట్ కోచ్.. ఆటను ఆపేసి ప్లేయర్లను వెనక్కి రమ్మనడం కూడా వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే వైడ్ బాల్, నో బాల్స్ విషయాల్లోనూ అంపైర్ల నిర్ణయాలను సవాల్ చేసే అవకాశాన్ని బీసీసీఐ కల్పించనుంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో ఈ రూల్ అమలవుతుండగా.. ఐపీఎల్‌లో కూడా పెట్టనున్నారు.

Story first published: Monday, March 6, 2023, 15:21 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+