IPL 2023: మయాంక్ అగర్వాల్‌తో పాటు ముగ్గురిని వదిలేయనున్న పంజాబ్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. వేలంలో దూకుడు కనబర్చి సమతూకమైన జట్టును ఎంచుకున్న
+పంజాబ్... అసలు సమరంలో మాత్రం ఆ జోరు కనబర్చలేకపోయింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు మాత్రమే నమోదు చేసి 6 స్థానంతో సరిపెట్టుకుంది. నయా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. లివింగ్ స్టోన్, శిఖర్ ధావన్ రాణించినా.. ఇతర ఆటగాళ్ల వైఫల్యం జట్టు కొంపముంచింది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లో ఈ తప్పిదాలను సరిచేసుకోవడంపై ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వచ్చే సీజన్‌కు ముందు ఓ ముగ్గురు ఆటగాళ్లను వదిలేయాలనుకుంటుంది.

మయాంక్ అగర్వాల్..
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జట్టు కెప్టెన్‌గా పంజాబ్ యాజమాన్యం మయాంక్ అగర్వాల్‌ను నియమించింది. కానీ అతను మాత్రం సారథ్య బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతో అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతిన్నది. 13 మ్యాచుల్లో 122 స్ట్రేక్ రేట్‌తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇది జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. వ్యక్తిగత ప్రదర్శన దెబ్బతినడంతో కెప్టెన్‌గా కూడా మయాంక్ తడబడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లో అతనిపై వేటు వేసి భారత్‌కు చెందిన ఓ మంచి టాపార్డర్ బ్యాటర్‌ను తీసుకోవాలని పంజాబ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

సందీప్ శర్మ..
పంజాబ్‌కు కగిసో రబడా రూపంలో అద్భుతమైన ఓవర్‌సీస్ పేస్ బౌలర్ ఉన్నాడు. అతను ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతనికి తోడుగా అర్షదీప్ సింగ్ అదరగొట్టాడు. అయితే ఈ ఇద్దరికి అండగా నిలిచే మరో పేసర్ జట్టులో లేకపోవడం బౌలింగ్ విభాగాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న సందీప్ శర్మ దారుణంగా విఫలమవ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. అతను తన సామర్థ్యం మేరకు రాణించకపోగా.. జట్టుకు తీరని నష్టం చేశాడు. 5 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు మాత్రమే తీసిన సందీప్ శర్మ.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి కత్తిలాంటి భారత యువ పేసర్‌ను తీసుకోవాలని పంజాబ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఓడియన్ స్మిత్..
ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్... ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత తేలిపోయాడు. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన స్మిత్.. గుజరాత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి రెండు బంతులకు 12 పరుగులను కాపాడలేకపోయాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు ఇచ్చి సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చాడు. అయినా కూడా అతనికి పంజాబ్ మెనేజ్‌మెంట్ అండగా నిలిచింది. కానీ అతని ఆట మాత్రం మారకపోవడంతో పక్కనపెట్టేసింది. 6 మ్యాచ్‌లు ఆడిన అతను బౌలింగ్‌లో 6 వికెట్లు తీసి ఓవర్‌కు 11.87 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లో 17 యావరేజ్‌తో 51 పరుగులు చేశాడు. దాంతోనే అతన్ని పక్కనపెట్టి మంచి ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications