IPL 2023: మినీ వేలం తర్వాత బలహీనంగా పంజాబ్ కింగ్స్.. తుది జట్టు అంచనా ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలోనే నిలకడలేని జట్టు ఏదైనా ఉందా? అంటే అది పంజాబ్ కింగ్స్. జట్టు పేరుతో సహా కెప్టెన్లు, కోచ్‌లు మారినా ఆ జట్టు రాత మారడం లేదు. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. అప్‌కమింగ్ సీజన్ కోసం కోచ్‌తో పాటు కెప్టెన్‌పైనే వేటు వేసింది. అంతేకాకుండా ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆ జట్టు ఎలాంటి వ్యూహం లేకుండా బరిలోకి దిగింది. రూ. 32.2 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. సామ్ కరన్ ఒక్కడి కోసమే రూ.18.50 కోట్లు ఖర్చు చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధికం. సికిందర్ రాజాను రూ.50 లక్షలకే తీసుకున్న పంజాబ్.. జట్టు బలహీనతలను మాత్రం పూరించలేకపోయింది. ఫారిన్ ప్లేయర్లతో నిండుగా ఉన్న పంజాబ్.. భారత ఆటగాళ్లపై ఫోకస్ పెట్టకుండా మళ్లీ విదేశీ ఆటగాళ్లనే తీసుకుంది.
పంజాబ్ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌లు మాత్రమే క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. మిగతా వారంతా అనామక ఆటగాళ్లే. ఈ ముగ్గురిలో అర్ష్‌దీప్ సింగ్ మినహా ఇద్దరూ భారత జట్టుకు దూరమయ్యారు. జట్టు మొత్తం పూర్తిగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో..
శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టోలు పంజాబ్ కింగ్స్ జట్టును నడిపించనున్నారు. ఈ ఇద్దరూ గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా ధావన్ 14 మ్యాచ్‌ల్లో 460 పరుగులతో రాణించాడు. మయాంక్ అగర్వాల్‌పై వేటు వేసిన పంజాబ్.. ధావన్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. దాంతో అతను మరింత బాధ్యతగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెయిర్ స్టో 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 253 పరుగులు చేశాడు. అయితే బెయిర్ స్టో గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ధావన్ సైతం భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావాలని ఈ ఇద్దరూ భావిస్తున్నారు.

మిడిలార్డర్‌లో షారూఖ్, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ..
ఐపీఎల్ 2021 సీజన్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన షారూఖ్ ఖాన్.. గత సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో 117 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ సీజన్‌లో అతను కీలకం కానున్నాడు. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన షారూఖ్ పంజాబ్ ఫినిషర్ రోల్ పోషించనున్నాడు.
లివింగ్ స్టోన్‌తో కలిసి మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నాడు. లివింగ్ స్టోన్ గత సీజన్‌లో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తన లెగ్ స్పిన్‌తో బౌలింగ్ విభాగానికి కూడా సహకారంగా నిలుస్తాడు. గతేడాదే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జితేశ్ శర్మ.. ఆకట్టుకున్నాడు. బంతిని నలుమూలలు బాదగలిగే సామర్థ్యం ఉన్న జితేశ్ శర్మ.. అప్‌కమింగ్ సీజన్‌లోనూ కీలక కానున్నాడు.

ఆల్‌రౌండర్లు సామ్ కరన్, రిషి ధావన్..
అప్‌కమింగ్ సీజన్‌లో అందరి కళ్లు సామ్ కరన్‌పైనే ఉన్నాయి. అత్యధిక ధర పలికి సామ్ కరన్.. ఈ ప్రైజ్ ట్యాగ్‌ను ఎలా హ్యాండిట్ చేస్తాడో చూడాలి. 2019లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ కరన్.. చెన్నై సూపర్ కింగ్స్ కు 2021 వరకు ఆడాడు. ప్రపంచకప్ సన్నాహకం కోసం గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారీ ధర అందుకున్న సామ్ కరన్‌పై పంజాబ్ భారీ ఆశలు పెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. మీడియం పేస్‌తో పాటు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయగలడు.

బౌలింగ్‌లో కగిసో రబడా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్..
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. రిషి ధావన్ కూడా వీరికి సహకారంగా ఉండనున్నాడు. స్పిన్నర్లలో హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ వంటి క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. రాహుల్ చాహర్ ఇప్పటికీ సత్తా చాటగా.. హర్‌ప్రీత్ బ్రార్ కూడా అతని బాటలో నడుస్తున్నాడు.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, షారూఖ్ ఖాన్, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, రిషి ధావన్, కగిసో రబడా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్
పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), షారూఖ్ ఖాన్, జానీ బెయిర్ స్టో, ప్రభ్‌సిమ్రానన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, రాజ్ భావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, బాల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడా, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications