మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ బ్యూటీ తళక్కున మెరిసింది. తమ అభిమాన జట్టుకు మద్దతు తెలిపిన ఆ అందం టీవీ కెమెరాల్లో కనిపించింది. సిక్స్, ఫోర్లు బాదుతున్నప్పుడు సంతోషంతో ఆమె చేసిన హడావుడి.. వికెట్ కోల్పోయినప్పుడు బాధగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా. ప్రతీ సీజన్‌లోనూ సందడి చేసే ప్రీతి జింతా ఈ సారి కూడా తమ జట్టు తొలి మ్యాచ్‌కే హాజరైంది. ఆమెతో పాటు పంజాబ్ ఫ్రాంచైజీకి చెందిన మరికొంత మంది యువతులు కూడా మ్యాచ్‌ను ప్రత్యక్ష వీక్షించేందుకు మైదానానికి వచ్చారు. వారు కూడా తమ హావభావాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రీతి జింతా కోసమే ఈ మ్యాచ్ చూస్తున్నానని కొందరంటే.. ఆమె వెనుకాల కూర్చున్న ఓ అమ్మాయి చాలా అందంగా ఉందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రీతి జింతా లాంటి అందమైన అమ్మాయిలు.. ఐపీఎల్‌కు స్పెషల్ అట్రాక్షన్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. దాంతో కేకేఆర్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ భానుక రాజపక్స(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ శిఖర్ ధావన్(29 బంతుల్లో 6 ఫోర్లతో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.