IPL 2023 ముందు.. ఆ ఐదుగురుకి గుడ్‌బై చెప్పనున్న ముంబై ఇండియన్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 15 ఏళ్ల లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుస్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సారి మాత్రం ఘోరంగా విఫలమైంది. సీజన్ ఆరంభం నుంచి చివరి వరకు పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికే పరిమితమైంది. ముంబై లాంటి బలమైన జట్టు ఇలా ఘోరంగా విఫలమవ్వడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మొదటి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవని ఆ జట్టు చివరి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. జట్టులోని మార్పులు ఆ టీమ్‌కు కలిసొచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించి పంత్ సేనను ప్లే ఆఫ్‌కు చేరకుండా నిలువరించగలిగింది. దాంతో అప్ కమింగ్ సీజన్ కోసం ముంబై భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన ఓ ఐదుగురి ఆటగాళ్లపై వేటు వేసే అవకాశం ఉంది. వారిపై ఓ లుక్కెద్దాం.

జయదేవ్ ఉనాద్కత్...
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అండగా ఉంటాడని వేలంలో రూ.1.3 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఉనాద్కత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసినప్పటికీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. 9.50 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఇది ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది. కీలక సమయాల్లో పరుగులు లీక్ చేయడం జట్టు ఓటమికి కారణమైంది. దాంతోనే ముంబై.. జయదేవ్ ఉనాద్కత్‌ను వదులుకునే అవకాశం ఉంది.

మయాంక్ మార్కండే
జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటును తీరుస్తాడని భావించి రూ.65 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసిన అనామక ప్లేయర్ మాయంక్ మార్కండే తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనే విఫలమవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. మురుగన్ అశ్విన్, హృతిక్ షోకీన్‌లనే ఆడించింది. రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చినా అతను తన సత్తాను నిరూపించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన మాయంక్‌ను ముంబై వదులుకునే చాన్స్ ఉంది.

ఫాబియన్ అలెన్..
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ సైతం ముంబై అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కగా బౌలింగ్‌లో ధారళంగా పరుగిలచ్చాడు. 11.50ఎకానమీతో బౌలింగ్ చేసాడు. ఈ క్రమంలోనే రూ.75 లక్షలతో ఏరి కోరి తెచ్చుకున్న ముంబై అతన్ని వదులుకునే చాన్స్ ఉంది.

టైమిల్ మిల్స్..
ఇంగ్లండ్ స్టార్ పేసర్ టైమిల్ మిల్స్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో రూ.1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముంబై.. అతని పేలవ ప్రదర్శనతో పక్కపెట్టాలనుకుంటుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన మిల్స్.. 6 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చాడు. ఏకానమీ 11గా ఉంది. అంతేకాకుండా అతను గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని జట్టులో వదులుకోవడం కంటే వదిలేయడమే బెటర్ అని ముంబై భావిస్తోంది.

బసిల్ థంపీ..
మెగా వేలంలో రూ.30 లక్షలకే కొనుగోలు చేసిన బసిల్ థంపీ సైతం జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన థంపీ.. ఐదు వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగలిచ్చాడు. ఎకానమీ రేట్ 9.50గా ఉంది. ఈ సీజన్‌లో బౌలర్ల వైఫల్యం కారణంగానే ముంబై ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే మంచి పేసర్లను తీసుకునేందుకు ముంబై ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఆటగాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications