IPL 2023: పవర్‌ఫుల్‌గా ముంబై ఇండియన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్‌లో చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. ఇప్పటికే ఆ జట్టు అత్యధికంగా ఐదు టైటిళ్లు గెలిచింది. తమకే సాధ్యమైన ఆటతీరుతో ఐపీఎల్‌ను శాసిస్తోంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంతో ఆ జట్టు కోర్ టీమ్ చెల్లా చెదురవ్వడంతో గత సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఎన్నడూ లేని విధంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచి ఆఖరి స్థానంలో నిలిచింది.
స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా దారుణంగా విఫలమవడం, జోఫ్రా ఆర్చర్ సీజన్ మొత్తానికి దూరంగా ఉండటం, హై ప్రైజ్ ట్యాగ్‌ను ఇషాన్ కిషన్ తట్టుకోలేకపోవడం వంటివి ముంబైని ముంచాయి. ఐపీఎల్ 2023 మినీ వేలంలో ముంబై ఈ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన కీరన్ పోలార్డ్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూ గ్రీన్‌తో భర్తీ చేసింది. ట్రేడింగ్ విండో ద్వారా జై రిచర్డ్‌సన్‌తో పాటు జాసన్ బెహండ్రాఫ్‌లను తీసుకొని బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. జోఫ్రా ఆర్చర్ కూడా అందుబాటులోకి రాగా.. డువాన్ జాన్సన్, పామ్స్ ములాని వంటి యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మినీ వేలం తర్వాత పేపర్‌పై ముంబై ఒకప్పటిలా బలంగా కనిపిస్తోంది. మరీ ఈసారైనా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందా? లేక గత సీజన్ మాదిరి పేలవ ప్రదర్శన కనబరుస్తుందా? అనేది చూడాలి.

ముంబై ఇండియన్స్ బలాలు..
జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకొని జట్టుకు అందుబాటులోకి రావడం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశం. ఇంగ్లండ్ తరఫున అదరగొట్టిన జోఫ్రా ఆర్చర్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సత్తా చాటాడు. గాయంతో దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా లోటు జోఫ్రా ఆర్చర్ తీర్చనున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అతిపెద్ద బలం. తిలక్ వర్మ, ట్రిస్టియన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి యువ ఆటగాళ్లు ఉండటం ప్లస్ పాయింట్. కామెరూన్ గ్రీన్ చేరికతో పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్ లోటు కూడా తీరింది. టీమ్ డేవిడ్ ఫినిషర్ రోల్ పోషించనున్నాడు. కుమార కార్తీకేయ రూపంలో మంచి స్పిన్నర్ ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ బలహీనతలు..
జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద బలహీనతగా మారింది. గాయంతో అతను సీజన్ మొత్తానికి దూరమవ్వడం.. అతని స్థానాన్ని భర్తీ చేయగల భారత పేసర్ జట్టులో లేకపోవడం ఇబ్బందిగా మారనుంది. జస్‌ప్రీత్ బుమ్రా నేపథ్యంలో ఫారిన్ బౌలర్లపైనే ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టింది. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో టీమ్ కాంబినేషన్ కూడా సమస్యగా మారనుంది. అంతేకాకుండా సరైన బ్యాటింగ్ బ్యాకప్ కూడా లేదు. ఫారిన్ ఆటగాళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ముంబైకి ఏర్పడింది.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, రమణ్‌దీప్ సింగ్, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, జై రిచర్డ్‌సన్/జాసన్ బెహండ్రాఫ్
ముంబై పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టియన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జేసన్ బెహ్రెండాఫ్, ఆకాష్ మధవాల్, కామెరూన్ గ్రీన్, జై రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములాని, నేహల్ వాధేరా, రాఘవ్ గోయల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications