Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: వర్షంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం.. చివరి అంతర్జాతీయ‌లోనూ ఇదే పరిస్థితి!

అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వర్షంతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మైదానం చెరువులా మారింది.

దాదాపు మ్యాచ్ రిజర్వ్‌డే అయిన సోమవారానికి వాయిదా పడనుంది. రాత్రి 11 గంటల వరకు వర్షం ఇలానే పడితే మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేస్తామని అంపైర్లు ప్రకటించారు. అయితే మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టైటిల్ గెలిచిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, ఘనంగా ఆటకు వీడ్కోలు పలుకుతాడనే చర్చ ఊపందుకుంది.

IPL 2023: MS Dhoni special bond with rain, same things happened in mahi last international match

కాకతాళీయమో ఏమో కానీ ధోనీ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డే.. ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలగడంతో రిజర్వ్‌డేకు వాయిదా పడింది.

ఈ సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులే చేయగలిగింది. 240 పరుగుల టార్గెట్‌తో టీమిండియా బ్యాటింగ్‌కు దిగగా.. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రిజర్వు డేకి వాయిదా వేశారు. వర్షంతో పిచ్ మాయిశ్చర్ రాగా.. ట్రెంట్ బౌల్ట్ తన స్వింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు.

జడేజా(77), ధోనీ పోరాడినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ చివర్లో ధోనీ రనౌటవ్వడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ధోనీకి ఇదే పరిస్థితి తలెత్తడం చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. వర్షంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉందని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, May 28, 2023, 23:15 [IST]
Other articles published on May 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+