Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఆ రూల్‌తో ఆల్‌రౌండర్ల పని ఉత్తదే: ధోనీ

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నరేంద్రమోదీ స్టేడియం పరిస్థితులు చేజింగ్‌కు అనుకూలంగా ఉంటాయనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

ఈ మ్యాచ్ ఆడటం చాలా ఉత్సాహంగా ఉందన్న హార్దిక్.. తన మార్గదర్శకుడు ధోనీతో తలపడటం గొప్ప గౌరవమని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు తమ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని, ఫలితం తమకు అనుకూలంగా ఉండేందుకు వారు కృషి చేస్తారని చెప్పాడు.

ms dhoni hardik pandya toss 1

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా విభిన్నమైనదని చెప్పిన హార్దిక్.. ఆ రూల్ కింద ఎవర్నీ ఆడించాలనేది హెడ్ కోచ్ చూసుకుంటాడని, కాంబినేషన్ కూడా అతనే సెట్ చేశాడని తెలిపాడు. తమ తుది జట్టు ఏంటో తనకు తెలియదన్నాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. వికెట్ చాలా బాగుందని, పిచ్‌లో ఎలాంటి మార్పు ఉండదని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే గత రాత్రి ఇక్కడ వర్షం పడిన నేపథ్యంలో డ్యూ వస్తుందా? రాదా? అనేది చెప్పలేమన్నాడు.

ఇంతమంది జనాల ముందు మ్యాచ్ ఆడటం గొప్పగా ఉందని, ఇతర మైదానాల కంటే ఇది డబుల్ ఉంటుందన్నాడు. తమ సన్నాహకాలు అద్భుతంగా జరిగాయని, అందరి కన్నా ముందే ప్రాక్టీస్ క్యాంప్‌లు పెట్టామని తెలిపాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. కెప్టెన్లకు లగ్జరీలాంటిదని, ఈ రూల్ ద్వారా ఆటగాడిని ఎంచుకోవడం సులువన్నాడు. అయితే ఈ రూల్ ద్వారా ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పాడు. టాస్ తర్వాత జట్లను ప్రకటించే నిబంధన తేవడంతో కెప్టెన్లు ఇద్దరూ తమ జట్ల వివరాలను వెల్లడించలేదు.

ఈ మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున కేన్ విలియమ్సన్ అరంగేట్రం చేస్తుండగా.. సీఎస్‌కే తరఫున బెన్ స్టోక్స్, రాజవర్థనే ఎంట్రీ ఇస్తున్నారు.

తుది జట్లు:

సీఎస్‌కే: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజవర్దనే హంగార్గేకర్

గుజరాత్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్

Story first published: Friday, March 31, 2023, 19:38 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+