హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం మాట్లాడిన ధోనీ.. ఇదే తనకు చివరి సీజన్ అని పరోక్షంగా స్పష్టం చేశాడు.
తన కెరీర్ చివరి దశలో ఉందన్న ధోనీ.. పూర్తిగా ఆస్వాదించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 'నేనేం చెప్పినా.. చేసినా, నా కెరీర్ చివరి దశలో ఉంది. దాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. చెన్నైలో ఆడటం చాలా బాగుంది. ఇక్కడి అభిమానులు ఎంతో ప్రేమను, ఆప్యాయతలను అందిస్తున్నారు. నా మాటలు వినేందుకు ఎప్పుడూ మైదానంలో ఆఖరి వరకు వేచి చూస్తారు.

బ్యాటింగ్ చేయడానికి నాకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ విషయంపై నేనేం ఫిర్యాదు చేయడం లేదు. వయసు పెరిగితే అనుభవం వస్తుంది. నా వయసు కూడా పైబడింది. ఈ విషయం చెప్పేందుకు నేను ఏ మాత్రం సిగ్గుపడను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలతో మరోసారి ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ ఊపందుకుంది. ఈ సీజన్‌తోనే ధోనీ ఆటకు వీడ్కోలు పలుకుతాడనే విషయం స్పష్టమైందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ కూడా ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను ధోనీ వీడ్కోలుకు అనుగుణంగానే సిద్దం చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
మే 23న జరిగే క్వాలిఫయర్ 1, మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లను చెన్నై వేదికగా జరగనుండగా.. అహ్మద్ వేదికగా మే 26న క్వాలిఫయర్ 2, మే 28న ఫైనల్ జరగనుంది. ఒకవేళ సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అర్హత సాధిస్తే చెన్నై వేదికగా జరిగే ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లను ధోనీ వీడ్కోలుకు ఉపయోగించనున్నారు. ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి ఉంటే మాత్రం చెన్నై వేదికగా కేకేఆర్‌తో మే 14న జరిగే చివరి లీగ్ మ్యాచ్ ధోనీకి చివరిది కానుంది.
ఫైనల్ చేరే పరిస్థితి ఉంటే మాత్రం చెన్నై వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో ఘనంగా వీడ్కోలు పలికి.. ఫైనల్ మ్యాచ్‌తో ధోనీకి సెండాఫ్ ఇవ్వనున్నారు. టైటిల్ గెలిచి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ భావిస్తోంది.