Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: మహమ్మద్ షమీ ‘సెంచరీ’.. అన్నీ క్లీన్ బౌల్డ్‌లే!(వీడియో)

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే‌)‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో షమీ.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వేను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ సీజన్‌లో తొలి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. ఐపీఎల్ వికెట్లలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో షమీ తీసిన తొలి వికెట్, 50వ వికెట్, 100వ వికెట్ క్లీన్ బౌల్డ్ ద్వారనే ఖాతాలో వేసుకున్నాడు. షమీ వేసిన ఫుల్ డెలివరీని ఆడటంలో కాన్వే విఫలమవ్వడంతో రెండు వికెట్లు నేలకూలాయి. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

mohammed shami ipl wicket 1

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున కేన్ విలియమ్సన్ , సీఎస్‌కే తరఫున బెన్ స్టోక్స్, రాజవర్థనే అరంగేట్రం చేశారు.

బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు షమీ ఆదిలోనే షాకివ్వగా.. రుతురాజ్ గైక్వాడ్, మొయిన్అ లీ(23) సీఎస్‌కే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే మొయిన్ అలీని, బెన్ స్టోక్స్‌(7)ను వరుస ఓవర్లలో రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో సీఎస్‌కే 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ తనదైన బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.

Story first published: Friday, March 31, 2023, 20:36 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+