Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సన్‌రైజర్స్‌ తరఫున ఆడటం చాలా మందికి ఇష్టం లేదు.. మహమ్మద్ నబీ సంచలన వ్యాఖ్యలు!

IPL 2023: Mohammad Nabi says Players were not willing to play for the SRH

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడటం చాలా మందికి ఇష్టం ఉండేది కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్, అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ అన్నాడు. గత రెండేళ్లుగా ఫ్రాంచైజీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆటగాళ్లలో చాలా మందికి అభద్రతా భావం ఏర్పడిందని తెలిపాడు. దాంతోనే జట్టులోని సగం మంది ఆటగాళ్లు అయిష్టంగా సన్‌రైజర్స్‌తో కొనసాగారని తెలిపాడు.

అనవసర మార్పులతో పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించాడు. 2017 నుంచి రషీధ్ ఖాన్‌తో పాటు సుదీర్ఘ కాలం సన్‌రైజర్స్‌కు ఆడిన మహమ్మద్ నబీ.. స్పోర్ట్స్‌యారీ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

గత రెండేళ్లుగా నాశనం చేశారు..

గత రెండేళ్లుగా నాశనం చేశారు..

'రషీద్ ఖాన్‌తో సహా నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరిన కొత్తలో టీమ్ అద్భుతంగా ఉండేది. 2017 నుంచి తర్వాతి మూడేళ్లు టీమ్ కాంబినేషన్, పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత రెండేళ్లుగా జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులోని ప్రతీది మారిపోయింది. టీమ్‌ కాంబినేషన్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌లోనూ అనేక మార్పులు జరిగి టీమ్ డ్రెస్సింగ్ వాతావరణమే మారిపోయింది. అనవసర మార్పులతో బలమైన సన్‌రైజర్స్ టీమ్‌ను నాశనం చేశారు.

రషీద్‌తో సహా..

రషీద్‌తో సహా..

మంచి టీమ్‌ను సిద్దం చేయాలనే ఉద్దేశంతో అనవసర మార్పులు చేశారు. ఐదేళ్లపాటు జట్టుకు అంబాసిడర్‌గా ఉన్న రషీద్‌ ఖాన్‌ను వదిలేశారు. రషీద్ ఖాన్ ఒక్కడినే కాదు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి టాప్ ఆటగాళ్లను వదులుకున్నారు. వారు అలా చేయాల్సింది కాదు. అసలు వారికి ఏం కావాలని అలా చేశారో.. నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు.'అని నబీ చెప్పుకొచ్చాడు.

2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన నబీని.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కేకేఆర్ కోటీ రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు అతన్ని వదిలేయగా.. మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చలేదు. దాంతో అన్ సోల్ట్ లిస్ట్‌లో నబీ చేరిపోయాడు.

డేవిడ్ వార్నర్‌పై వేటు..

డేవిడ్ వార్నర్‌పై వేటు..

జట్టుకు టైటిల్ అందించడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఘోరంగా అవమానించింది. కెప్టెన్సీతో పాటు తుది జట్టు నుంచి తప్పించిన సన్‌రైజర్స్.. వాటర్ భాయ్‌గా వాడుకుంది. కనీసం డగౌట్‌లోకి రానివ్వకుండా అమమానకరంగా వ్యవహరించింది.

ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట వార్నర్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్.. తాజా సీజన్‌తో కేన్ విలియమ్సన్‌కు గుడ్‌బై చెప్పింది. కెప్టెన్ అని కూడా చూడకుండా కేన్ విలియమ్సన్‌ను ఘోరంగా అవమానించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు

అబ్దుల్ సమద్,ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజలక్ ఫరూఖీ, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కెండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దగర్, నితీశ్ కుమార్ రెడ్డి, అకీల్ హొస్సెన్, అన్‌మోల్ ప్రీత్ సింగ్

Story first published: Wednesday, December 28, 2022, 12:44 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+