అనామక ప్లేయర్‌కు రూ.2.6 కోట్లు పెట్టిన సన్‌రైజర్స్.. అసలు ఈ వివ్రాంత్ శర్మ ఎవరు?

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. సత్తా ఉన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇంగ్లండ్ యువ ప్లేయర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్ .. మయాంక్ అగర్వాల్ కోసం రూ.8.25 కోట్లు పెట్టింది. అయితే అనామక ప్లేయర్ అయిన వివ్రాంత్ శర్మకు పోటీ పడి మరీ రూ.2.60 కోట్లు ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న ఈ యువ ఆటగాడి కోసం సన్‌రైజర్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీపడ్డాయి. దాంతో ఈ కుర్రాడి పంటపండింది.
ఎవరి వివ్రాంత్ శర్మ ?
భారీ ధర పలికిన ఈ అనామక కుర్రాడు ఎవరా? అని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వివ్రాంత్ శర్మ.. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాడు. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును తొలిసారి నాకౌట్స్ చేర్చాడు. ఓ మ్యాచ్‌లో 124 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 154 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టి ఆకర్షించాడు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ అయిన వివ్రాంత్ శర్మ.. బౌలింగ్ కూడా చేయగలడు.
అన్నయ్య కారణంగా..
23 ఏళ్ల వివ్రాంత్ శర్మ తన అన్నయ్య కారణంగా క్రికెట్ కెరీర్‌గా మార్చుకున్నాడు. జమ్మూలో క్లబ్ క్రికెట్ ఆడిన వివ్రాంత్ శర్మ.. 12 ఏళ్ల వరకు రైట్ హ్యాండ్ బ్యాటర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతని సోదరుడు రాణించడంతో.. తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటి వరకు 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన వివ్రాంత్ శర్మ.. 128.18 స్ట్రైక్ రేట్‌తో 191 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసాడు. అత్యుత్తమ బౌలింగ్ 4/13.
ఉమ్రాన్ మాలిక్ రికమండేషన్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. బ్యాటింగ్‌ను బలోపేతం చేయడం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వివ్రాంత్ శర్మపై నమ్మకం ఉంచింది. అయితే అబ్డుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ రికమండేషన్‌తో వివ్రాంత్ శర్మను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్రాన్ మాలిక్‌లా సంచలన ప్రదర్శనతో వివ్రాంత్ శర్మ ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications