For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 Mini Auction: మొత్తం 5 సెట్లు.. ఫ్రాంచైజీల చూపంతా రెండో సెట్‌పైనే.. కోట్లు కొల్లగొట్టేది వారే!

IPL 2023 Mini Auction: Predicting the most expensive buys in Set 2

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. కేరళలోని కొచ్చి వేదికగా డిసెంబర్ 23న మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మినీ వేలం ప్రారంభం కానుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

ఇందులో 30 స్లాట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు.

రెండో సెట్‌పైనే అందరి చూపు..

రెండో సెట్‌పైనే అందరి చూపు..

తొలి సెట్‌లో బ్యాటర్లు ఉండగా.. రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు ఉన్నారు. మూడో సెట్‌లో వికెట్ కీపర్లను చేర్చగా.. నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లను చేర్చారు. మినీవేలంలో సెట్‌ల వారీగా వేలం వేయనున్నారు. అయితే ఈ మినీవేలంలో ఆల్‌రౌండర్ల హవానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో సెట్‌లో ఉన్న బ్యాటింగ్ ఆల్‌రౌండర్లపైనే ఫ్రాంచైజీలు చూపు ఉంది. రెండో సెట్‌లో సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ ఉన్నారు.

సామ్ కరన్, బెన్ స్టోక్స్‌కు భారీ ధర..

సామ్ కరన్, బెన్ స్టోక్స్‌కు భారీ ధర..

రెండో సెట్‌లో ఉన్న సామ్ కరన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్‌‌లకు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవగా.. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక పలికిన ఆటగాడిగా స్టోక్స్ రికార్డు కెక్కాడు. 2017 సీజన్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ.14.5 కోట్లకు స్టోక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ వేలంలో సామ్ కరన్, బెన్ స్టోక్స్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టోక్స్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉంది.

సికిందర్ రాజా కూడా..

సికిందర్ రాజా కూడా..

కామెరాన్ గ్రీన్ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ ఆల్‌రౌండర్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. తొలి టీ20లో 30 బంతుల్లో 61 పరుగులు చేసిన గ్రీన్.. మూడో వన్డేలో 21 బంతుల్లో 52 రన్స్‌తో సత్తా చాటాడు. గతంలో సన్‌రైజర్స్ తరఫున ఆడిన షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్.. బంతితోపాటు బ్యాట్‌తోనూ రాణించగలరు. ఇక సికిందర్ రజా విషయానికి వస్తే.. ఈ జింబాబ్వే క్రికెటర్ టీ20 వరల్డ్ కప్‌లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఒడియన్ స్మిత్..

ఒడియన్ స్మిత్..

గత కొంత కాలంగా జింబాబ్వే విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. బంతితోపాటు బ్యాట్‌తోనూ రాణించగల సత్తా అతడి సొంతం. రూ.50 లక్షల కనీస ధరతోనే వేలానికి వస్తున్నప్పటికీ.. అతను భారీ ధర పలికే అవకాశం ఉంది. కరేబియన్ పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ అయిన ఓడియన్ స్మిత్‌‌ను ఐపీఎల్ 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2022 వేలానికి ముందు భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో... రెండు మ్యాచ్‌ల్లో అతను 157కిపైగా స్ట్రైక్ రేట్‌తో 60 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లు తీశాడు. కానీ ఐపీఎల్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోవడంతో.. పంజాబ్ అతన్ని వేలానికి వదిలేసింది. ఈసారి అతను రూ. 50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలానికి వస్తున్నాడు.

Story first published: Tuesday, December 20, 2022, 17:21 [IST]
Other articles published on Dec 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+