
హైదరాబాద్: ఐపీఎల్ 2023 మెగా వేలానికి రంగం సిద్దమైంది. కేరళలోని కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇందులో 30 స్లాట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు.
ఇక 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2021 సీజన్‌లో క్రిస్ మోరిస్ పలికిన రూ.16.25 కోట్లు అత్యధిక ధరగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2015లో అప్పటి ఢిల్లీ డేర్ డేవిల్స్ యువీ కోసం రూ.16 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ రెండు రికార్డులు ఈసారి బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెన్ స్టోక్స్, సామ్ కరన్ వంటి ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఇంత ధర చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాయి. సీజన్ల వారిగా అత్యధిక ధర పలికి ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కెద్దాం!
1. ఐపీఎల్- 2008: మహేంద్ర సింగ్ ధోనీ(సీఎస్‌కే)- రూ.9.5 కోట్లు
2. ఐపీఎల్-2009: కేవిన్ పీటర్సన్(ఆర్‌సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్(సీఎస్‌కే)- రూ.9.8 కోట్లు
3.ఐపీఎల్-2010: కీరన్ పొలార్డ్(ముంబై), షేన్ బాండ్(కేకేఆర్)- రూ.4.8 కోట్లు
4. ఐపీఎల్ 2011: గౌతమ్ గంభీర్(కేకేఆర్)-రూ.14.9 కోట్లు
5. ఐపీఎల్ 2012: రవీంద్ర జడేజా(సీఎస్‌కే)-రూ.12.8 కోట్లు
6. ఐపీఎల్ 2013: గ్లేన్ మ్యాక్స్‌వెల్(పంజాబ్ కింగ్స్) రూ.6.3 కోట్లు
7. ఐపీఎల్ 2014: యువరాజ్ సింగ్(ఆర్‌సీబీ)-రూ.14 కోట్లు
8. ఐపీఎల్ 2015: యువరాజ్ సింగ్(ఢిల్లీ డేర్ డేవిల్స్)-రూ.16 కోట్లు
9. ఐపీఎల్-2016: షేన్ వాట్సన్(ఆర్‌సీబీ)-9.5 కోట్లు
10. ఐపీఎల్-2017: బెన్ స్టోక్స్(ఆర్‌పీఎస్)-రూ.14.5 కోట్లు
11. ఐపీఎల్ 2018: బెన్ స్టోక్స్(రాజస్థాన్ రాయల్స్)-రూ.12.5 కోట్లు
12.ఐపీఎల్ 2019: జయదేవ్ ఉనాద్కత్(రాజస్థాన్), వరుణ్ చక్రవర్తీ( పంజాబ్)-రూ.8.4 కోట్లు
13. ఐపీఎల్ 2020: ప్యాట్ కమిన్స్(కేకేఆర్)-రూ.15.5 కోట్లు
14. ఐపీఎల్ 2021: క్రిస్ మోరీస్(రాజస్థాన్)- రూ.16.25 కోట్లు
15.ఐపీఎల్ 2022: ఇషాన్ కిషన్(ముంబై)-రూ.15.25 కోట్లు
16. ఐపీఎల్ 2023 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరో కామెంట్ చేయండి..?