Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Mini Auction: కావ్య పాప.. నీ మైండ్ దొబ్బిందా? ఆ బచ్చాగాడికి రూ.13.25 కోట్లా? ఫ్యాన్స్ ఫైర్!

 IPL 2023 Mini Auction: Kaviya Maran brutally trolled after SRH bags Harry Brooks for rs 13.25 crore.

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి సొంత అభిమానుల ఆగ్రహానికి గురైంది. కేరళలోని కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2023 మినీ వేలంలో హెడ్ కోచ్ బ్రియాన్ లారా, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీదరణ్‌తో కలిసి హాజరైన కావ్య పాప.. ఇద్దరి ప్లేయర్లకే రూ.21.50 కోట్లు ఖర్చు చేసింది. దాంతో సన్‌రైజర్స్ స్ట్రాటజీ అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంగ్లండ్ యువ క్రికెటర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించిన కావ్య పాప.. భారత వెటరన్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కోసం రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది.

బచ్చాగాడికి రూ.13.25 కోట్లా..?

మయాంక్ అగర్వాల్ కొనుగోలును సమర్థిస్తున్నా.. హరీ బ్రూక్‌కు అంత ధర ఖర్చు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ 13.5 కోట్లకు మరో రెండున్నర కోట్లు కలిపితే 4డీ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ చిక్కేవాడని అభిప్రాయపడుతున్నారు. అయినా ఓ ఓవర్‌సీస్ ప్లేయర్‌కు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జట్టులో ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని మండిపడుతున్నారు. మిడిలార్డర్‌లో మార్క్‌రమ్, ఫిలిప్స్ ఉన్నారని, బ్రూక్‌ను ఎక్కడ ఆడిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌లో తొలిసారి ఆడనున్న బ్రూక్ కోసం ఇంత ఖర్చు చేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు.

రాజస్థాన్ రాయల్స్ ట్రాప్‌లో..

రూ.42.25 కోట్ల భారీ పర్స్ మనీతో పాల్గొన్న సన్‌రైజర్స్‌ను ఇతర ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా దెబ్బతీసాయనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఇద్దరి ఆటగాళ్ల కోసం రూ.21.50 కోట్లు ఖర్చు చేయించాయని, రాజస్థాన్ రాయల్స్ ట్రాప్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పడిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్‌ను కొనుగోలు చేస్తారని ముందే భావించి.. భారీ ధర పలికేలా పోటీపడ్డారని కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కావ్య పాప గుర్తించలేకపోయిందని, ఫ్రాంచైజీల పోటీ కారణంగానే మయాంక్ అగర్వాల్, హారీ బ్రూక్‌ భారీ ధర పలికారని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి హారీ బ్రూక్‌కు రూ.4 కోట్లు కూడా ఎక్కువేనని, మయాంక్ అగర్వాల్‌కు రూ.5 కోట్లు సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు.

20.75 కోట్లతో 12 మంది ఆటగాళ్లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మొత్తం 14 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఇద్దరి కోసమే రూ.21.50 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మిగతా రూ.20.75 కోట్లతో 12 మందిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికే సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్, హరీ బ్రూక్ కోసం అంత ఖర్చు చేసిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. ఈ వేలంలో కూడా సన్‌రైజర్స్ అలసత్వం కలిసొచ్చిందని, బెన్ స్టోక్స్‌ను తీసుకోవాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, December 23, 2022, 15:45 [IST]
Other articles published on Dec 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+