For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్!

IPL 2023: Mayank Agarwal likely to lead SRH for upcoming season

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.25 కోట్ల భారీ ధరకు తీసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్.. మయాంక్‌ను ఎంచుకుంది. కెప్టెన్‌గా పనికొస్తాడనే సన్‌రైజర్స్.. మయాంక్ కోసం ఇంత భారీ ధర చెల్లించినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్‌కు ఇండియన్ బ్యాటర్లు కొరత ఉండటంతో పాటు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేయగల ఓపెనర్ అవసరం ఉంది. గత సీజన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు.

దాంతో అతనిపై వేటు వేసిన సన్‌రైజర్స్.. బేస్ ప్రైజ్‌కు లభించే అవకాశం ఉన్నా కేన్ మామ వైపు చూడలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు తీసుకుంది. పూర్తిగా బ్యాటింగ్‌ను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్.. అందుకు తగ్గట్లుగానే వేలంలో దూకుడు ప్రదర్శించింది. ఇంగ్లండ్ యువ బ్యాటర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ సాలిడ్‌గా ఉంది.

భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగీలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, ఆదిల్ రషీద్‌లతో ప్రతిభావంతమైన స్పిన్నర్లున్నారు. అయితే జట్టును నడిపించే ఆటగాడినే సన్‌రైజర్స్ ఎంచుకోవాల్సి ఉంది. ఎయిడెన్‌ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మలు కెప్టెన్సీ రేసులో ఉన్నారు.

అత్యంత సీనియర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఉన్నా అతని వయసు, ఫిట్‌నెస్ సమస్యలు ప్రతికూలంగా మారాయి. మరో విదేశీ ప్లేయర్‌కు కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం సన్‌రైజర్స్‌కు లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కూడా పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిందని, ఓనర్ కావ్యమారన్, హెడ్ కోచ్ బ్రియాన్ లారా మయాంక్ అగర్వాల్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అనుభవం ఉన్న నేపథ్యంలో అతనికే సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే సన్‌రైజర్స్ అధికారికంగా ప్రకటిస్తుందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

Story first published: Sunday, December 25, 2022, 8:25 [IST]
Other articles published on Dec 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+