Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. జట్టును విడిచి వెళ్లిన స్టార్ పేసర్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తొడ కండరాల గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సీజన్ మొత్తానికి దూరమవ్వగా.. తాజాగా స్టార్ పేసర్ మార్క్‌వుడ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తన సతీమణి సారా లోన్స్‌డేల్ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఇంగ్లండ్ పేసర్ స్వదేశం పయనమయ్యాడు.

ఈ విషయాన్ని అతనే స్వయంగా లక్నో సూపర్ జెయింట్స్ మీడియా విభాగంతో పంచుకున్నాడు. ఈ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్.. ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే మార్క్‌వుడ్ ఈ విషయాన్ని లక్నోసూపర్ జెయింట్స్ యాజమాన్యానికి తెలియజేసాడు. రెండో బిడ్డ జన్మించిన తర్వాత వెళ్లిపోతానని సమాచారం ఇచ్చాడు.

Mark Wood

అయితే అతను మళ్లీ వస్తాడా? రాడా? అనేదానిపై స్పష్టత లేదు. అతను చెప్పిన మాటలను వింటే మాత్రం మళ్లీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన మార్క్ వుడ్‌ 11 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

'నా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకే స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మళ్లీ కచ్చితంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. నన్ను క్షమించిండి. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఆడిన మ్యాచ్‌ల్లో వికెట్లు కూడా పడగొట్టాను.

లక్నో వంటి ఫ్రాంచైజీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు, మెనెజ్‌మెంట్‌ అందరూ మద్దతుగా నిలిచారు. ఈ సీజన్‌లో మా జట్టు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'అని మార్క్‌వుడ్ చెప్పుకొచ్చాడు. సహచర ఆటగాళ్లను హగ్ చేసుకొని వీడ్కోలు పలికిన మార్క్‌వుడ్.. జెర్సీపై వారి సంతకాలను తీసుకున్నాడు.

ఓవైపు గాయాల బెడదతో బాధపడుతున్న లక్నోకు మార్క్‌వుడ్ దూరమవ్వడం కోలుకోలేని దెబ్బ. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. రెండు విజయాలే సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Story first published: Monday, May 8, 2023, 19:07 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+