ధర్మశాల: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. క్యాచ్ నేలపాలు చేయడంతో కోపంతో ఊగిపోయిన కుల్దీప్ యాదవ్.. సహచర ఆటగాడిపై నోరు పారేసుకున్నాడు. రాయలేని పదాలతో బండబూతులు తిట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్‌లో లియామ్ లివింగ్ స్టోన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో డిప్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జ్ చేతుల్లోకి వచ్చింది. కానీ నోర్జ్ బంతిని అందుకోలేకపోయాడు. విపరీతమైన డ్యూ ఉండటంతో బంతి అతని చేతుల్లో నుంచి జారిపోయింది.

దీంతో కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. కోపంతో గట్టిగా అరిచేసాడు. ఈజీ క్యాచ్ పట్టకపోతే ఎలా అని బూతులు తిట్టాడు. ఈ క్యాచ్ పట్టుంటే లివింగ్ స్టోన్ 2 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 94 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్‌ను గెలిపించేంత పనిచేశాడు. కానీ ఇషాంత్ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ గట్టెక్కింది.

అథర్వ టైడే ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కూడా యశ్‌ధుల్ నేలపాలు చేశాడు. దాంతో ఢిల్లీ కోచ్ రికీపాంటింగ్ నెత్తిని పట్టుకున్నాడు. ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ రెండు సునాయస క్యాచ్‌లతో పాటు మరో రెండు రనౌట్లను ఢిల్లీ చేజార్చింది. ఫీల్డింగ్‌లోనూ తప్పిదాలు చేసింది.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సైతం తమ తప్పును అంగీకరించాడు. చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్ ఓటమి తప్పదని భావించామని, కానీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్నందించారని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగులతో గట్టెక్కగా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది.