IPL 2023: అజింక్యా రహానేతో పాటు ఆ ముగ్గురిని వదిలేయనున్న కేకేఆర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారి పట్టింది. సరైన ఓపెనర్లు లేకపోవడం జట్టు ఓటమికి కారణమైంది. డెత్ బౌలింగ్ కూడా బలహీనంగా ఉండటం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. సరైన కాంబినేషన్ కూడా సెట్ అవ్వలేదు. దాంతో జట్టు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు ఆటగాళ్లను కేకేఆర్ వదిలేయాలనుకుంటుంది.

ఆరోన్ ఫించ్
ఐపీఎల్ 2022 సీజన్‌లో అలెక్స్ హేల్స్‌కు రిప్లేస్‌మెంట్‌గా ఆరోన్ ఫించ్‌ను కేకేఆర్ తీసుకుంది. దాంతో 9 ఫ్రాంచైజీలకు ఆడిన ఆటగాడిగా ఫించ్ రికార్డుకెక్కాడు. రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌కు అతను అందుబాటులోకి వచ్చాడు. వాస్తవానికి వేలంలో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన అవకాశాన్ని ఫించ్ అందిపుచ్చుకోలేకపోయాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో (28 బంతుల్లో 58) హాఫ్ సెంచరీ చేసిన ఫించ్.. ఆ తర్వాత 3, 0, 14 పరుగులతో విఫలమయ్యాడు. దాంతో ఫించ్‌ను పక్కనపెట్టిన కేకేఆర్.. వచ్చే సీజన్‌కు ముందు వదిలేయాలనుకుంటుంది. అతనికి బదులు మంచి ప్లేయర్‌ను తీసుకోవాలనుకుంటుంది.

అజింక్యా రహానే
గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను కేకేఆర్ వేలంలో అతని కనీస ధర కోటీ రూపాయలకు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో 34 బంతుల్లో 44 పరుగులు చేసిన రహానే.. ఆ తర్వాత 9, 12, 7, 8 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. రహానే వైఫల్యం కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసింది. దాంతో అతన్ని కేకేఆర్ వదిలేయాలనుకుంటుంది. అతని స్థానంలో మంచి భారత బ్యాటర్‌ను ఎంచుకోవాలనుకుంటుంది.

శివం మావి..
శివం మావిని సైతం కేకేఆర్ వదులుకునే ఆలోచనలో ఉంది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన శివం మావి.. నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. దాంతో అతన్ని శివం మావి వదులుకొని మరో భారత పేసర్‌ను తీసుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాణించడంతో అతన్ని మళ్లీ కొనుగోలు చేయగా.. దారుణంగా విఫలమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications