For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ధోనీ ఫార్మూలా పాటించకపోవడమే ఆర్‌సీబీ కొంపముంచింది!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిరాశపర్చింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకరిద్దరి ప్రదర్శనలతోనే ఏడు విజయాలు అందుకున్న ఆర్‌సీబీ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. సమష్టి ప్రదర్శన లోపించడంతోనే ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.

మరోవైపు సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఒకరిద్దరితో మ్యాచ్‌లు గెలిచినా.. టైటిళ్లు గెలవలేమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో చెలరేగినా.. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచినా.. ఆ జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయాయి.

 IPL 2023

ఆర్‌‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లు ఐపీఎల్ విజయ రహస్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కు తత్వం బోధపడటం లేదు. ఐపీఎల్‌ టైటిల్ గెలవాలంటే.. ధోనీ చెప్పినట్లు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారికి బెస్ట్ స్లాట్స్ కేటాయించి అద్భుత ప్రదర్శన కనబర్చేలా తీర్చు దిద్దుకోవాలి.

ప్రతీ మ్యాచ్‌కు మార్పులు చేయకుండా వీలైనంత వరకు ఒకే జట్టును టోర్నీ మొత్తం కొనసాగించాలి. విఫలమైనా అండగా నిలిచి ప్రోత్సహించాలి. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడటమే చాలా ముఖ్యం. ఈ ఫార్మూలాతోనే తమ జట్టు ఐపీఎల్‌లో సక్సెస్ అయిందని, ప్లే ఆఫ్స్ చేరిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అన్నాడు.

ఈ ఫార్మూలానే ఆర్‌సీబీ మరిచిపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు మార్పులు చేసి ఆటగాళ్లలో గందరగోళం నెలకొనేలా చేసింది. ఏ ఆటగాడిపై విశ్వాసం కనబర్చలేదు. కీలకమైన గుజరాత్‌తో కూడా అరంగేట్ర ప్లేయర్‌‌తో బరిలోకి దిగింది. ఒకరిద్దరు మినహా సమష్టి ప్రదర్శనే కనిపించలేదు. చివరకు ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.

అప్‌కమింగ్ సీజన్‌లోనైనా ఆర్‌సీబీ ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు టీమ్‌కు అవసరమైన దేశవాళీ ఆటగాళ్లను తీర్చిదిద్దుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కేకేఆర్ గత నాలుగేళ్ల పాటు రింకూ సింగ్‌కు అండగా నిలిచి సూపర్ డూపర్ ఫినిషర్‌ను సిద్దం చేసుకుంది.

ఈ తరహాలో ఆటగాళ్లను తీర్చిదిద్దుకుంటేనే ఆర్‌సీబీకి విజయాలు దక్కుతాయి. లేకుంటే ఎప్పటిలానే ఈసాల కప్ నమ్దే అంటూ స్లోగన్స్ ఇచ్చుకోవాల్సిందే.

Story first published: Monday, May 22, 2023, 18:16 [IST]
Other articles published on May 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+