Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఓ కావ్య పాప.. కెప్టెన్‌ను మార్చినా.. ఎర్రీ బ్రూక్ తీసుకొచ్చినా.. మన దరిద్రం మారలేదమ్మా!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. రెండు ఓటములతో ఈ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచి అశలు రేకెత్తించింది. కానీ ఆ తర్వాత ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో వరుసగా ఓటమిపాలై పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.

ముఖ్యంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త బ్యాటింగ్‌తో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. జట్టులో ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్(18), రూ.8 కోట్లకు తీసుకున్న మయాంక్ అగర్వాల్(2)తో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(12), హెన్రీచ్ క్లాసెన్(17) దారుణంగా విఫలమవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.

kavya maran trolled

దాంతో సన్‌రైజర్స్ టీమ్‌పై సొంత అభిమానులే ట్రోలింగ్‌కు దిగారు. కెప్టెన్‌ను మార్చినా.. కోట్లు పెట్టి హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌ను తీసుకున్నా సన్‌రైజర్స్ దరిద్రం మారలేదని కామెంట్ చేస్తున్నారు. హ్యారీ బ్రూక్‌కు ఎర్రీ బ్రూక్‌గా నిక్ నేమ్ పెట్టారు. టీమ్ ఓనర్ కావ్య మారన్‌పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

కావ్య మారన్ స్వస్థలం అయిన చెన్నైలో ఆరెంజ్ ఆర్మీ చెత్తాటతో ఆమె పరువు తీసిందని, చుట్టాల ముందు తలెత్తుకోకుండా చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు తమిళనాడు సీఎం ఎమ్‌కే స్టాలిన్‌ సతీ సమేతంగా హాజరయ్యారు. ఆయన కుమారుడు ఉదయ నిధి కూడా మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరై చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు తెలిపారు.

కావ్య మారన్‌కు ఎమ్‌కే స్టాలిన్ వరుసకు తాత అవుతాడు. స్టాలిన్ తండ్రి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య. ఈ నేపథ్యంలోనే చుట్టాల ముందు ఇజ్జత్ తీసారు కదారా? అని కావ్య పాప ఫ్రస్టేట్ అవుతున్న పిక్‌తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు బౌలింగ్‌లోనూ బలహీనతలు ఉండటంతో సన్‌రైజర్స్ వరుస ఓటములు ఎదుర్కొంటుంది.

మరికొందరు మాత్రం కావ్యమారనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అమ్ముడుపోయిందని, డబ్బులు తీసుకోని ఓటమిపాలైందని ఆరోపిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మండిపడుతున్నారు.

Story first published: Saturday, April 22, 2023, 11:23 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+