చెన్నై: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలు రాయి అందుకున్న మూడో ప్లేయర్‌గా.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 52).. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 3 వేల పరుగులు చేసిన 21వ బ్యాటర్‌గా నిలిచిన బట్లర్.. అత్యంత వేగంగా చేసిన మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను అధిగమించాడు.

వార్నర్, ఫాఫ్ డుప్లెసిస్ 94 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకోగా.. బట్లర్ 85 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫిట్ సాధించి క్రిస్ గేల్ టాప్‌లో ఉండగా.. 80 ఇన్నింగ్స్‌లతో కేఎల్ రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. 2016లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన బట్లర్.. ఆరంభంలోనే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న అతను ప్రతీ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. గతేడాది 863 పరుగులతో జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన బట్లర్ మూడు హాఫ్ సెంచరీలతో 204 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాజ్ జాబితాలో శిఖర్ ధావన్ (225) డేవిడ్, వార్నర్ (209)తో బట్లర్ పోటీ పడుతున్నాడు.
ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 3,035 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. బట్లర్‌కు తోడుగా.. పడిక్కల్(38), అశ్విన్(30), హెట్‌మైర్(30 నాటౌట్) రాణించారు.