Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌కు చాలా ఇగో.. ధోనీ అంటే మండిపోయేవాడు: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌పై మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్‌కు ఇగో ఎక్కువని, ధోనీ అంటే మండిపోయేవాడని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవ నేపథ్యంలో పఠాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో హిందీ వ్యాఖ్యానం చేస్తున్న పఠాన్.. లక్నో-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ... ధోనీ కనిపించినప్పుడల్లా గంభీర్ తన అక్కసును వెళ్లగక్కేవాడని గుర్తు చేసుకున్నాడు.

IPL 2023: Irfan Pathan Says Gautam Gambhir played with the ego of MS Dhoni

'గౌతమ్ గంభీర్ కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనీ మీద తీవ్రంగా ఆగ్రహంగా ఉండేవాడు. ఐపీఎల్‌లో ధోనీని చాలాసార్లు తన స్పిన్నర్లతో ఔట్ చేయించడంలో గంభీర్ సక్సెస్ అయ్యాడు. కేకేఆర్-సీఎస్‌కే మ్యాచ్‌ల్లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చేప్పుడు అతని కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ సెట్ చేసేవాడు.

201 సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. అప్పటికే పూణె 74/4తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ సీజన్‌లో కేకేఆర్‌కు ఆడిన పీయూష్ చావ్లా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ధోనీ బ్యాటింగ్‌కు రాగానే గంభీర్, అతని చుట్టూ ఫీల్డర్లను మొహరించాడు. షకీబ్ అల్ హసన్, సూర్యకుమార్ యాదవ్, యూసఫ్ పఠాన్‌లను ధోనీ చుట్టే సెట్ చేసేవాడు.

స్పిన్నర్లను ఆడటంలో ఇబ్బందిపడే ధోనీ.. గంభీర్ ఉచ్చులో పడేవాడు. చుట్టూ ఫీల్డర్లు ఉండటంతో డిఫెన్స్ చేయడంలో లేదా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 14 బంతులాడి 5 పరుగులే చేశాడు. నేను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాను. కానీ అప్పుడు ధోనీ రనౌట్ అయ్యాడు.'అని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.

Story first published: Thursday, May 4, 2023, 20:09 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+