Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: మార్క్‌రమ్ మామ.. క్లాసెన్ కాక చేరికతో సన్‌రైజర్స్ రాత మారేనా?

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో మొదలుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 72 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు విఫలమైన తీరు చూసి.. ఈ సారి కూడా టైటిల్ గెలవడం కష్టమేననే అభిప్రాయానికి వచ్చారు. మ్యాచ్ ప్రారంభం వరకు పేపర్‌పై బలంగా కనిపించిన హైదరాబాద్.. కనీస పోటీ ఇవ్వకపోవడం అభిమానులను విస్మయపరిచింది.

అయితే తొలి మ్యాచ్‌కు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్, సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లు దూరంగా ఉన్నారు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో భారత్‌కు రాలేకపోయారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే సౌతాఫ్రికా టీమ్‌కు ఈ సిరీస్ గెలవడం ముఖ్యం కావడంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఆ దేశ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడేందుకు ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయలేదు. దాంతో సౌతాఫ్రికా ఆటగాళ్లంతా ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు.

Aiden Markram, Heinrich Klaasen to arrive

నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ ఆదివారం ముగియగా.. చివరి ఓవర్‌లో కెప్టెన్ మార్క్‌రమ్ 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా ఆటగాళ్లంతా క్షణం ఆలస్యం చేయకుండా భారత ఫ్లైట్ ఎక్కారు. గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఇప్పటికే జట్టుతో కలవగా.. సన్‌రైజర్స్ ఆటగాళ్లు కూడా సోమవారం రాత్రికి జట్టులో చేరనున్నారు. ఫామ్‌లో ఉన్న మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ జట్టుతో కలిస్తే టీమ్ బలం రెట్టింపు అవ్వనుంది. వీరి రాకతోనైనా జట్టు రాత మారుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లింది. మార్క్‌రమ్ కెప్టెన్సీలో చెలరేగితేనే సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురితో పాటు అన్రిచ్ నోకియా, లుంగిడి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్).. కగిసో రబడా (పంజాబ్ కింగ్స్).. డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్) ఐపీఎల్ లో భాగం కానున్నారు.

Story first published: Monday, April 3, 2023, 19:15 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+