IPL 2023: కోట్లలో ఖర్చు.. ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుంది?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌లోనే ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. యావత్ క్రికెట్ ప్రపంచం ముందు బీసీసీఐని క్రికెట్ పెద్దన్నగా నిలబెట్టింది. ప్రతీ సీజన్‌కు కొంత పుంతలు తొక్కుతూ యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఎంతలా అంటే ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలని కలలు కనేంత.! ఐపీఎల్ జరిగే రెండు నెలల పాటు ప్రపంచ క్రికెటే ఆగిపోయేంత.! తమ జాతీయ జట్లను కాదని స్టార్ ప్లేయర్లంతా భారత్‌కు క్యూ కట్టేంత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ గుర్తింపుపొందింది. ఎంతో మంది అనామక ఆటగాళ్లు ఐపీఎల్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.
8 ఫ్రాంచైజీలతో మొదలైన ఐపీఎల్(IPL 2023).. గతేడాదే 10 జట్లకు విస్తరించింది. కోట్లతో కూడుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌తో బీసీసీఐకి కోట్ల ఆదాయం వస్తున్నా.. ఫ్రాంచైజీలకు ఏమైనా ఫైదా ఉందా? వారికి ఉన్న ఆదాయా మార్గాలు ఏంటి? ఐపీఎల్‌తో 10 ఫ్రాంచైజీలకు లాభామా? నష్టమా? అనే విషయాలు తెలుసుకుందాం.

మీడియా హక్కులతోనే
కోట్ల ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు లాభం కూడా అలానే ఉంది. ఐపీఎల్‌లో మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంచైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. ఐపీఎల్ నిర్వహణలో వచ్చే ఆదాయం మొత్తంలో 60 నుంచి 70 శాతం ఆదాయం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది.
ఈ సారి బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించగా.. బీసీసీఐకి రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. టీవీ హక్కులను స్టార్ నెట్‌వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయోకామ్ సంస్థ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ లెక్కన బీసీసీఐకి ప్రతీ ఏడాది మీడియా రైట్స్ ద్వారా సుమారు రూ.9,670 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీలకు, 5 శాతం ప్రైజ్ మనీ కింద విభజిస్తారు. ఈ లెక్కన ఒక్కో ఫ్రాంచైజీకి సుమారు రూ. 459 కోట్ల ఆదాయం లభిస్తోంది.

టైటిల్ స్పాన్సర్‌షిప్
మీడియా హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం లభిస్తుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా సంస్థ రూ. 439.8 కోట్లకు దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంచనుంది.
ఇవి కాకుండా ప్రతి ఫ్రాంచైజీకి కొంతమంది ప్రత్యేక స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఆ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటాయి.

గేట్ రెవెన్యూ..
కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లు పరిమిత వేదికలు, బయో బబుల్ నిబంధనల మధ్య ఐపీఎల్ జరగ్గా.. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ లేకుండా పోయింది. గత రెండు సీజన్లలో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించినా చెప్పుకోదగ్గ ఆదాయం అయితే రాలేదు. కానీ ఈసారి హోమ్ అండ్ అవే పద్దతిలో జట్లు తలపడనున్నాడు.
సొంతమైదానాల్లో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ మ్యాచ్ టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ఆ ఫ్రాంచైజీకే ఉంటుంది. టికెట్లు అమ్మగా వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం కూడా వాళ్లకే వస్తుంది. బీసీసీఐ, స్పాన్సర్లకు కొద్ది వాటా వెళ్తుంది. స్టేడియం ఖర్చులో పోను.. గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీలకు ఏటా రూ.15కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.

ప్రైజ్ మనీ, జెర్సీల అమ్మకం..
ప్రైజ్ మనీ ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతాయి. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీషర్టులు, క్యాప్‌లు, ఇతర ఆట వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయం ఆర్జిస్తాయి.
టీమ్స్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా కూడా డబ్బులు అందుకుంటాయి. అంతుకే బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తుంటాయి.

ఖర్చు కూడా భారీగానే..
ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఫ్రాంచైజీలకు ఎక్కువే ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజీ.. తమ ఫైనల్ బిడ్ మొత్తంలో ఏటా పది శాతాన్ని ఐపీఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకయ్యే ప్రధాన ఖర్చు ఆటగాళ్ల జీతాలు, అకామిడేషన్, ఇతర ఖర్చులు. ఫ్రాంచైజీలకు వచ్చే రెవెన్యూలో 35-45 శాతం వరకు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు ప్రభుత్వానికి అనేక విధాలుగా.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications