బాంచత్.. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతాం: హార్దిక్ పాండ్యా
అహ్మదాబాద్: అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ గెలిచి తమ కలను నేరవేర్చుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. టైటిల్ కల నేరవేరిందని, బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా మాట్లాడిన వీడియోను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ వీడియోలో తమ జట్టు ప్రయాణం గురించి మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ ప్రాక్టీస్‌తో పాటు ఈ సీజన్‌లో ఎలా ఆడాలని అనుకుంటున్నామనే విషయాలను వివరించాడు. 'చిన్నప్పుడు నేను క్లాస్‌రూమ్‌లో నిద్రపోతూ కలలు కనేవాడిని. మా టీచర్ ఎప్పుడూ నాపై మా నాన్నకు ఫిర్యాదు చేసేది. మా నాన్న మాత్రం నాకు అండగా నిలిచేవాడు. నిద్ర పోవడం లేదని, కలలు కంటున్నాడని చెప్పేవాడు.

మ్యాచ్‌లు గెలవాలని, అభిమానుల మనసులను గెలవాలని, భారత్ తరఫున ఆడాలని, ఐపీఎల్ విజేతగా నిలవాలని, కెప్టెన్‌గా టైటిల్‌ను ఎత్తుకోవాలని.. నేను పగటి కలలు కనేవాడిని. అయితే ఈ కలలు ఒక్కొక్కటిగా నెరవేరాయి. గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చా. నా గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీతో కలిసాను.
ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది, టీమ్ మేనేజ్‌మెంట్ మదిలో ఉన్న ఏకైక విషయం.. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం. గతేడాదే మేం ట్రోఫీని గెలిచాం. మా కల నెరవేరింది. కానీ ఆ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే మా ముందున్న లక్ష్యం. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం ప్రతీ ఒక్కరి కల. అందులో ఎలాంటి సందేహం లేదు.
మేం ఆ టైటిల్ కూడా గెలిచాం. కానీ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునేలా నాణ్యమైన క్రికెట్ ఆడాలి.
ఇలాంటి కలకు ముగింపు ఉండదు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. మరికొద్ది సేపట్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications