
టీమ్ బలాలు..
గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). గత సీజన్ ఐపీఎల్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన గుజరాత్.. అందరి అనుమానాలను పటా పంచలు చేస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు కెప్టెన్‌గా సత్తా చాటాడు. బరిలోకి దిగిన తొలి సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా కెప్టెన్ ప్రమోషన్ అందుకున్న హార్దిక్.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
హార్దిక్‌తో పాటు జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఉండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఓడియన్ స్మిత్‌లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలరు. అంతేకాకుండా జట్టులోని స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, డేవిమిల్లర్ సూపర్ ఫామ్‌లో ఉండటం.. బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం టీమ్‌కు కలిసొచ్చే అంశం. అన్నింటికి మించీ కోచ్ ఆశిశ్ నెహ్రా పర్యవేక్షణ టీమ్‌కు అతిపెద్ద బలం.

బలహీనతలు..
టీమ్ బ్యాటింగ్‌లో వావ్ ఫ్యాక్టర్ కలిగిన ప్లేయర్ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ ప్రధాన సమస్య. శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నా.. వారి బ్యాటింగ్ శైలి టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు లేకపోవడం, తక్కువ స్ట్రైక్‌రేట్ ఆడటం టీమ్‌కు నష్టం చేసే విషయం.
అంతేకాకుండా డెత్ బౌలింగ్ లేకపోవడం కూడా గుజరాత్‌కు సమస్యగా మారింది. స్లో బౌలర్ అయిన మోహిత్ శర్మను డెత్ బౌలర్‌గా ఉపయోగించుకునేందుకే తీసుకున్నట్లు తెలుస్తోంది. శుభ్‌మన్‌కు తోడు సరైన ఓపెనర్ లేకపోవడం కూడా గుజరాత్‌కు ప్రతికూలాంశమే. గత సీజన్‌లో వృద్దిమాన్ సాహా రాణించినా.. ఈ సారి అతను ఎలా ఆడుతాడనేదానిపై సందేహం నెలకొంది.

గుజరాత్ టైటాన్స్ టీమ్
ఓవర్‌సీస్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, అల్జారీ జోసెఫ్, జోషువా లిటిల్
ప్యూర్ బ్యాటర్స్: కేన్ విలియమ్సన్, శుభ్‌మన్ గిల్, అభినవ్ సదరంగని, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్
పేస్ ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, ఓడియన్ స్మిత్, దర్శన్ నల్కండే,
స్పిన్ ఆల్‌రౌండర్లు: రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్..
కీపర్లు:సాహా, భరత్, ఉర్విల్ పటేల్-గుజరాత్ లోకల్ ప్లేయర్, మాథ్యూవేడ్
స్పిన్ బౌలర్లు:రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయికిషోర్
పేసర్లు: మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, శివమ్ మావి, ప్రదీప్ సంగ్వాన్, మోహిత్ శర్మ

తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్)/ కేఎస్ భరత్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, శివమ్ మావి, అల్జారీ జోసెఫ్/స్మిత్/జోషువా లిటిల్, ఆర్‌సాయి కిషోర్/యష్ దయాల్
టీమ్ X ఫ్యాక్టర్-హార్దిక్ పాండ్యా
ఇంపాక్ట్ ప్లేయర్లు: విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్


Click it and Unblock the Notifications
