Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 మినీ వేలం తర్వాత మరింత డేంజరస్‌గా గుజరాత్ టైటాన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2023: Gujarat Titanss strongest playing XI after Mini Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అసాధారణ ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్వితీయమైన ఆటతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆశిష్ నెహ్రా పర్యవేక్షణ.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఇక ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా యువ వికెట్ కీపర్ రెహ్మానుల్లా గుర్బాజ్, వెటరన్ పేసర్ లాకీ ఫెర్గూసన్‌లను వదిలేసిన గుజరాత్ టైటాన్స్.. మినీవేలంలో స్మార్ట్‌గా ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

కేఎస్ భరత్, జోషువా లిటిల్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్‌లను తక్కువ ధరకే తీసుకుంది. పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ అప్‌కమింగ్ సీజన్‌లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక గుజరాత్ టైటాన్స్ తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం!

ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, సాహా..

ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, సాహా..

గతసీజన్ మాదిరే ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2022లో ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో గుజరాత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళల్లో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 483 పరుగులు చేశాడు. ఇక సాహా విధ్వంసకర బ్యాటింగ్‌తో 11 మ్యాచ్‌ల్లో 317 రన్స్ చేశాడు. సాహా అత్యంత ప్రతిభావంతమైన వికెట్ కీపర్ కావడం కూడా గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. అయితే గత ఏడాది కాలంగా సాహా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతని ఫిట్‌నెస్ కూడా కీలకం కానుంది. సాహా ఆడలేని స్థితిలో కేఎస్ భరత్‌కు అవకాశం దక్కవచ్చు.

మిడిలార్డర్‌లో కేన్ మామ, మిల్లర్..

మిడిలార్డర్‌లో కేన్ మామ, మిల్లర్..

గతేడాది కాస్త బలహీనంగా కనిపించిన మిడిలార్డర్‌ను గుజరాత్ బలోపేతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరకు దొరికిన కేన్ విలియమ్సన్‌ను మరో ఆలోచన లేకుండా తీసుకుంది. కేన్ మామ రాకతో గుజరాత్ మిడిలార్డర్‌కు స్థిరత్వం రానుంది. సన్‌రైజర్స్ తరఫున బ్యాటింగ్‌లో అదరగొట్టిన కేన్ మామ.. కెప్టెన్‌గా విఫలమవడంతో ఆ జట్టు వదులుకుంది. కేన్ మామ తర్వాత అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ గుజరాత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. గుజరాత్ టైటిల్ గెలవడంలో డేవిడ్ మిల్లర్‌ది కీలక పాత్ర. 16 మ్యాచ్‌ల్లో మిల్లర్ 481 రన్స్ చేయగా.. మనోహర్ 8 మ్యాచ్‌ల్లో 108 పరుగులతో రాణించాడు. మిల్లర్ అసాధారణ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లను గెలిపించాడు.

ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్..

ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్..

గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలం ఆల్‌రౌండర్లు ఉండటం. హార్దిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం కలిసొచ్చే అంశం. చివరి రెండు బంతులకు సిక్స్‌లు కొట్టి గెలిపించిన తెవాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే. గత సీజన్‌లో హార్దిక్ 15 మ్యాచ్‌ల్లో 487 పరుగులతో రాణించాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. తెవాటియా బౌలింగ్ చేయకపోయినా.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో చిరస్మరణీయ విజయాలందించాడు. రషీద్ ఖాన్ 16 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.

 బౌలర్లుగా షమీ, జోసెఫ్, శివమ్ మావీ

బౌలర్లుగా షమీ, జోసెఫ్, శివమ్ మావీ

మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి గుజారత్ టైటాన్స్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. వేలంలో శివమ్ మావిని రూ.6 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో షమీ 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవర్ సీస్ కోటా అల్జారీ జోసెఫ్‌ను ఆడించనుంది. పిచ్ కండిషన్స్ బట్టి సాయి కిషోర్, శివమ్ మావిలో ఒకరికి అవకాశం ఇవ్వనుంది.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు(అంచనా)

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, శివమ్ మావి, అల్జారీ జోసెఫ్

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు..

హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్‌జరీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నాల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జోషువా లిటిల్, ఉర్విల్ పటేల్, శివమ్ మావి, కేఎస్ భరత్, ఓడియన్ స్మిత్, కేన్ విలియమ్సన్.

Story first published: Saturday, December 31, 2022, 15:30 [IST]
Other articles published on Dec 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+