హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. గతేడాది అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది.
టోర్నీ ఆసాంతం యశస్వీ జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చేలరేగినా.. కీలక సమయంలో జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్‌మైర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ ఫామ్ కోల్పోవడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.

టోర్నీ ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో పాయింట్స్ టేబల్‌లో టాప్-3లో నిలిచిన రాజస్థాన్ సెకండాఫ్‌లో మాత్రం వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సందీప్ శర్మ నోబాల్ వేయడంతో గెలుపు ముంగిట బోర్లాపడింది. ఈ ఓటమి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.
14 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి ఏడు ఓడిన రాజస్థాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నిలకడలేమి ఆటతీరు ఆ జట్టు కొంపముంచింది. ఫిట్‌నెస్ సమస్యలతో ట్రెంట్ బౌల్ట్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం కూడా విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్ కోసం టీమ్ ప్రక్షాళనకు సిద్దమైంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైంది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో పాటు సందీప్ శర్మ, నవ్‌దీప్ సైన్‌లను వదులుకునే జాబితాలో చేర్చింది. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు ఆడమ్ జంపా, జోరూట్, జాసన్ హోల్డర్‌లను కూడా వదులుకోనుంది.
ఇప్పటి నుంచి అప్ కమింగ్ సీజన్ వరకు ఈ ఆటగాళ్ల పెర్ఫామెన్స్‌పై స్పెషల్ ఫొకస్ పెట్టనుంది. బాగా రాణించిన ఆటగాళ్లను ఉంచుకొని విఫలమైన ఆటగాళ్లను వదిలేయనుంది.