Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: రూ.13 కోట్ల ఆటగాడితో పాటు ఆ ప్లేయర్లకు గుడ్‌బై చెప్పనున్న సన్‌రైజర్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 8వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈ సారి మరీ దారుణంగా విఫలమైంది.

గత సీజన్‌ పేలవ ప్రదర్శన నేపథ్యంలో జట్టు ప్రక్షాళన‌ చేసిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ హెడ్ కోచ్ నుంచి ఆటగాళ్ల వరకు చాలా మార్పులు చేసింది.
ఏకంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పైనే వేటు వేసింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ విభాగంపై ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ మినీ వేలం రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్‌, రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసి చేతులు కాల్చుకుంది.

 From Brook to Tripati, Here is the players list that SRH likely to release

ఈ ఇద్దరూ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో పాటు నమ్మకం పెట్టుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ దారుణంగా విఫలమయ్యారు. ఫారిన్ ప్లేయర్లతో పాటు భారత స్టార్ ఆటగాళ్ల వైఫల్యం సన్‌రైజర్స్ కొంపముంచింది.

మిలియన్ డాలర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండటం విశేషం. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటైన హ్యారీ బ్రూక్.. 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్‌ను అప్‌కమింగ్ సీజన్ ముందట సన్‌రైజర్స్ వదిలేసే అవకాశం ఉంది.

అతనితో పాటు పెద్దగా ప్రభావం చూపని ఫజలక్ ఫరూకీ, గ్లేన్ ఫిలిప్స్, అకీల హోస్సెన్, మార్కో జాన్సెన్, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, ఉపేంద్ర సింగ్ యాదవ్‌లను రిలీజ్ చేయవచ్చు. దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్‌ను కూడా సన్‌రైజర్స్ వదులుకోవచ్చు. అయితే అప్‌కమింగ్ సీజన్ ముందు ప్లేయర్ల ఫామ్‌ను ఆధారంగా రిలీజ్ ఆటగాళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో టీమ్ వైఫల్యానికి ప్రధాన కారణం కోచింగ్ డిపార్ట్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలే. ప్రతీ మ్యాచ్‌కు జట్టును మారుస్తూ ఆటగాళ్లలో ఆందోళన నెలకొనేలా చేశారు.

Story first published: Sunday, May 21, 2023, 20:41 [IST]
Other articles published on May 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+