Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 టైటిల్ గెలిచే నాలుగు జట్లు ఇవే.. ముంబై ఇండియన్స్‌కు నోచాన్స్!

IPL 2023: Four Teams Who Are Most Likely To Win IPL Season 16

హైదరాబాద్: క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 (IPL 2023) సీజన్‌కు సమయం ఆసన్నమైంది. రెండు నెలల పాటు అభిమానులను అలరించేందుకు ఈ ధనాధన్ లీగ్ సిద్దమవుతోంది. మార్చి 31‌న ఈ వరల్డ్ ఫేమస్ లీగ్‌కు తెరలేవనుండగా.. 10 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ లీగ్ ప్రారంభానికి ఇంకా 13 రోజులు సమయం ఉండగా.. అప్పుడే అభిమానులు, మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో పాటు మరో మూడు జట్లు ఈ సారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. వాటిపై ఓ లుక్కెద్దాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్( SRH) ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గత సీజన్ పేలవ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నా ఆ టీమ్ మేనేజ్‌మెంట్ బలహీనతలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో టీమ్ బొక్కలను పూడ్చేసింది. వేలంలో మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌లను కొనుగోలు చేసి బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది. ఆదిల్ రషీద్, మయాంక్ మార్కేండేలతో స్పిన్‌ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అంతకుమించి ఆల్‌రౌండర్లతో సన్‌రైజర్స్ నిండి ఉంది. టీమ్‌లో స్థార్ ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే సన్‌రైజర్స్‌ సునాయసంగా ఫైనల్ చేరుతోంది.

 ఆర్‌సీబీ

ఆర్‌సీబీ

ప్రతీసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగడం.. అందుకు తగ్గట్లు ప్లే ఆఫ్స్ చేరడం.. అభిమానులను నిరాశపర్చడం ఆర్‌సీబీ(RCB)కి అలవాటే. ఈసారి కూడా ఆ జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో గతేడాది ప్లే ఆఫ్స్ చేరి మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఆర్‌సీబీ.. ఈ సారి మరింత బలంగా కనిపిస్తోంది. గత సీజన్ లోపాలను మినీ వేలం ద్వారా తీర్చుకున్న ఆ జట్టు.. పటిష్టంగా కనిపిస్తోంది. విల్ జాక్స్ సేవలను చివరి నిమిషంలో కోల్పోయినా.. మైఖేల్ బ్రేస్‌వెల్‌తో అతని స్థానాన్ని భర్తీ చేసింది. పైగా కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

చెన్నై సూపర్ కింగ్స్..

చెన్నై సూపర్ కింగ్స్..

గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్(CSK).. వేలంలో లోపాలను సరిదిద్దుకొంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను తీసుకున్న సీఎస్‌కే ఈ సారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక సొంతమైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడనుండటం సీఎస్‌కే‌కు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా గత సీజన్‌లో దీపక్ చాహర్ సేవలను కోల్పోయిన ఆ జట్టు.. ఈ సారి అతన్ని ప్రధాన పేసర్‌గా వాడుకోనుంది. రవీంద్ర జడేజా సైతం సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అంబటి రాయుడు వంటి సీనియర్ ప్లేయర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లతో టీమ్ సమతూకంగా ఉంది. ధోనీ చివరి సీజన్ కావడంతో ఆ జట్టు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమించనుంది. టైటిల్‌తో తమ కెప్టెన్‌కు వీడ్కోలు పలకనుంది.

 గుజరాత్ టైటాన్స్..

గుజరాత్ టైటాన్స్..

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్(GT) సైతం మరోసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గతేడాది సమష్టి ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయిన గుజరాత్.. ఈ సారి బ్యాకప్‌ను కూడా బలోపేతం చేసుకుంది. కేఎస్ భరత్, జోషువా లిటిల్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్‌లను తక్కువ ధరకే తీసుకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ శుభ్‌గిల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. కేన్ మామ రాకతో టీమ్ బ్యాటింగ్ బలంగా మారింది. కేన్ మామ సైతం సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సూపర్ ఫామ్‌ కనబరుస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Story first published: Saturday, March 18, 2023, 18:32 [IST]
Other articles published on Mar 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+