For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ దూరం.. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు!

IPL 2023: Four captaincy options for Delhi Capitals, if Rishabh Pant misses out

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడమే కాక.. మంటలు చెలరేగి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పంత్‌ సమయ స్పూర్తితో కారులోంచి బయటికి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో పంత్‌ కనీసం ఆరు నెలలు మైదానానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాంతో అతను స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరం కానున్నాడు. పంత్‌కు చోటు అనూహ్య ప్రమాదం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. పంత్ లోటును తీర్చే ఆటగాడిని ఆ జట్టు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్ దూరమవడంతో ఆ జట్టు కాంబినేషన్ కూడా దెబ్బ తిననుంది. ఐపీఎల్ కు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పితే బాగుంటుంది..? ఆ స్థానానికి ఎవరైతే సూటవుతారు..? ఢిల్లీని నడిపించేది ఎవరు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో నలుగురు ఆటగాళ్లున్నారు.

డేవిడ్ వార్నర్..

డేవిడ్ వార్నర్..

రిషభ్ పంత్ దూరమైతే ఢిల్లీ సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్‌కు అపార అనుభవం ఉంది. 2016 సీజన్ టైటిల్‌ను కూడా కెప్టెన్‌గా వార్నర్ గెలిచాడు. పంత్ ప్రమాదం తర్వాత ఢిల్లీ యాజమాన్యం కూడా ఇదే భావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. అనుభవంతో పాటు జట్టును నడిపించగల సామర్థ్యం వార్నర్‌కే ఉందని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 పృథ్వీ షా..

పృథ్వీ షా..

భారత ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేయాలనుకుంటే మాత్రం పృథ్వీ షాకు సారథ్య బాధ్యతలు తగ్గవచ్చు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం లేకున్నా.. దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షాకు అపార అనుభవం ఉంది. పృథ్వీ షా సారథ్యంలోనే ముంబై జట్టు 2020-21 విజయ్ హజారే ట్రోఫీ గెలిచింది. అంతేకాకుండా అండర్ 19 జట్టును నడిపించిన అనుభవం కూడా పృథ్వీ షాకు ఉంది.

మనీశ్ పాండే..

మనీశ్ పాండే..

పృథ్వీ షా‌కు కెప్టెన్సీ ఇస్తే అతని వ్యక్తిగత ప్రదర్శన దెబ్బ తింటుందని భావిస్తే.. ఇటీవల వేలం కొనుగోలు చేసిన మనీశ్ పాండే‌కు సారథ్య బాధ్యతలు దక్కవచ్చు. కర్ణాటక కెప్టెన్‌గా మనీశ్ పాండేకు అపార అనుభవం ఉంది. అతని హయాంలో కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. గతంలో వార్నర్ గైర్హాజరీలో పాండే సన్‌రైజర్స్‌ను కూడా నడిపించాడు.

మిచెల్ మార్ష్..

మిచెల్ మార్ష్..

డేవిడ్ వార్నర్ కాకుంటే మరో ఆసీస్ స్టార్ మిచెల్ మార్ష్ కూడా పోటీలో ఉన్నాడు. మార్ష్ కు ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం లేదు. కానీ 2010లో ఆస్ట్రేలియా అండర్ -19 జట్టుకు అతడే సారథి. వార్నర్ కాకుంటే మార్ష్ రూపంలో ఢిల్లీకి మంచి ఆప్షన్ ఉంది. కానీ మార్ష్ ఫిట్‌నెస్ సమస్యలు అతనికి ప్రతికూలం కానున్నాయి.

Story first published: Saturday, December 31, 2022, 17:19 [IST]
Other articles published on Dec 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+