
గుజరాత్ X చెన్నై
ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. మార్చి31న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా గురు శిష్యులు తలపడనున్నారు. గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. చెన్నై సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ పోటీపడనున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య రెండే రెండు మ్యాచ్‌లు జరగ్గా.. ఈ రెండింటిలోనూ గుజరాతే విజయం సాధించింది. ఈసారి ఆ లెక్క సరిచేయాలనే ఆలోచనలో చెన్నై ఉంది. ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

ఆర్‌సీబీ X ముంబై ఇండియన్స్..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా రసవత్తరంగా జరగనుంది. ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ పోరు ఎలానే.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ-ముంబై ఇండియన్స్ పోరును ఫ్యాన్స్ అలానే చూస్తారు. ఏప్రిల్ 02న బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నా.. అతనికి చెందిన టీమ్‌గానే ఫ్యాన్స్ భావిస్తారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మతో కోహ్లీ పోరు ఎలా ఉంటుందనే ఆతృత అభిమానుల్లో ఉంటుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరగ్గా ముంబై జట్టే 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్‌సీబీ 13 గెలిచింది.

హైదరాబాద్ X రాజస్థాన్ రాయల్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఉప్పల్ వేదికగా ఏప్రిల్ 02న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ ఇరు జట్ల మధ్య నడిచిన మాటల యుద్దం ఈ మ్యాచ్‌పై హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ ఇరు జట్లు ఈ మ్యాచ్‌తోనే ఈ సీజన్‌లో తమ క్యాంపైన్ మొదలుపెట్టనున్నాయి. బలబలాల పరంగా ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా.. చెరో 8 సార్లు గెలిచాయి.

ముంబై X చెన్నై..
టోర్నీల్లోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే పోరు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది. రోహిత్ శర్మ, ధోనీ సారథ్యంలోని ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఏప్రిల్ 8న ఈ మ్యాచ్ జరగనుంది. గత రికార్డులు మాత్రం ముంబైకే అనుకూలంగా ఉన్నాయి. 34 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 20 సార్లు గెలుపొందింది. చెన్నై మాత్రం 14 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.

బెంగళూరు vs చెన్నై
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఐపీఎల్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన ఈ రెండు జట్ల మధ్య పోటీ ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టనుంది. ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్‌లు జరగ్గా.. చెన్నై 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఆర్‌సీబీ 10 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.


Click it and Unblock the Notifications












