Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Final: చెన్నై బౌలర్ చెత్త రికార్డు!

అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్‌పాండే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో తుషార్ దేశ్ పాండే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

తుషార్ దేశ్‌పాండే వేసిన తన తొలి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో శుభ్‌మన్ గిల్ వరుస బౌండరీలు బాదగా.. సాహా కూడా చితక్కొట్టాడు. సాయి సుదర్శన్ అయితే తుషార్ పాండేకు చుక్కలు చూపించాడు. అతను వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 4, 4 బాది 20 పరుగులు పిండుకున్నాడు.

Tushar Deshpande

దాంతోనే తుషార్ పాండే చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్ఫించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో షేన్ వాట్సన్(61/0-ఆర్‌సీబీ) అగ్రస్థానంలో ఉండగా.. ఫెర్గూసన్ (56-కేకేఆర్), తుషార్ దేశ్‌పాండే(56) రెండో స్థానంలో ఉన్నారు.

అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులిచ్చుకున్న తొలి బౌలర్‌గా తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డును లిఖించుకున్నాడు. 9.92 ఎకానమీతో 564 పరుగులు సమర్పించుకున్నాడు.

తుషార్ తర్వాత ప్రసిధ్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కగిసో రబడా 8.34 ఎకానమీతో 548, సిద్దార్త్ కౌల్ 8.28 ఎకానమీతో 547 పరుగులు, మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య చేధనకు దిగగా.. మూడు బంతులు వేయగానే వర్షం వచ్చింది.

చివరకు మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించగా.. చెన్నై 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 54 బంతుల్లో 99 పరుగులు చేయాలి.

Story first published: Tuesday, May 30, 2023, 0:49 [IST]
Other articles published on May 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+