అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీపక్ చాహర్ చేసిన తప్పిదం అతనికి కలిసొచ్చింది. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతిని తుషార్ దేశ్‌పాండే ఫుల్లర్ లెంగ్త్‌లో వేయగా.. శుభ్‌మన్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి బ్యాక్‌వర్డ్ దిశగా గాల్లోకి లేచి దీపక్ చాహర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమైన చాహర్.. నేలపాలు చేశాడు. అప్పటికి గిల్(3) పరుగులు మాత్రమే చేశాడు. ఈ లైఫ్‌తో గిల్ ఊపిరి పీల్చుకోగా.. చెన్నై ఆటగాళ్లు నెత్తి బాదుకున్నారు.

ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. గుజరాత్‌ను ఒంటి చేత్తో ఫైనల్‌కు తీసుకొచ్చాడు. అలాంటి ఆటగాడు ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన దీపక్ చాహర్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్యాచ్ పట్టి ఉంటే గుజరాత్ టైటాన్స్ పతనం మొదలయ్యేదని అభిప్రాయపడుతున్నారు. ఇక క్వాలిఫయర్-1లో కూడా ఇదే తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు.
ఈ అవకాశంతో గిల్ చెలరేగుతున్నాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్‌లో సహా 6, 4, 4 బాదగా.. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో గిల్ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డు పరుగెత్తుతుంది.