Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Final: చెలరేగిన సుదర్శన్, సాహా.. చెన్నై ముందు భారీ లక్ష్యం!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు దుమ్మురేపారు. సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.

IPL 2023 Final

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో గిల్ చెలరేగగా.. సాహా కూడా చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే చెన్నై వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది.

క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ధోనీ తన మార్క్ కీపింగ్‌తో విడదీసాడు. జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌ను కళ్లు చెదిరే స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డేంజరస్ గిల్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన సుదర్శన్‌తో కలిసి సాహా చెలరేగాడు.

జడేజా బౌలింగ్‌లో బౌండరీ బాదిన సాహా 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీపక్ చాహర్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి సాహా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సాహా ఔటైనా.. సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వరుస సిక్సర్లు, బౌండరీలతో సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను తుషార్ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 4 బాదాడు. 18వ ఓవర్‌ను పతీరణ కట్టుదిట్టంగా వేసినా.. తుషార్ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో హార్దిక్ రెండు సిక్సర్లు బాదాడు. సాయి సుదర్శన్ ఓ బౌండరీ బాదాడంతో గుజరాత్ 200 పరుగుల మార్క్‌ను ధాటింది. పతీరణ వేసిన ఆఖరి ఓవర్‌లో సాయి సుదర్శన్ వరుసగా రెండు సిక్స్‌లు బాది సెంచరీ చేరువవగా.. మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.

దాంతో 4 పరుగుల దూరంలో శతకాన్ని చేజార్చుకున్నాడు. తదుపరి మూడు బంతులను పతీరణ కట్టుదిట్టంగా వేయగా.. రషీద్ ఖాన్ ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Monday, May 29, 2023, 21:21 [IST]
Other articles published on May 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+