Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Final: దాగుడు మూతలు ఆడుతున్న వర్షం.. తడిసిముద్దైన మోదీ స్డేడియం!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ప్రారంభకావాల్సిన మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. గత మూడు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది.

పిచ్ రిపోర్ట్ సమయంలో ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. కొద్ది నిమిషాల క్రితం వర్షం ఆగిపోగా మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉందని గుర్తించారు. ఆట కొనసాగాలే సిబ్బంది కృషి చేస్తుండగా వర్షం మళ్లీ మొదలైంది.

IPL 2023 Final: Rain continues to play hide and seek!, Overs Of CSK vs GT Game Start Getting Reduced

భారీ కురుస్తుండటంతో ఈ రోజు ఆట కొనసాగం సందేహంగా మారింది. రిజర్వ్ డే అయిన సోమవారమే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. ఇక మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమైనా.. ఓవర్లను కుదించనున్నారు. రాత్రి 11.56 నిమిషాలను డెడ్‌లైన్‌గా విధించారు. ఈ సమయం లోపు 5 ఓవర్ల ఆట సాధ్యమైనా ఆడిస్తారు. కుదరకపోతే రిజర్వ్ డే అయిన సోమవారమే ఆటను కొనసాగిస్తారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యంకాకపోతేనే మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్తుంది. ఒకవేళ కనీసం ఒక్క బంతి పడ్డా.. రిజర్వ్‌డే రోజున అక్కడి నుంచే మ్యాచ్‌ కొనసాగుతుంది. ఒకవేళ టాస్‌ పడి.. ఒక్క బంతి పడకపోతే.. రిజర్వ్‌డే రోజు కొత్తగా మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.
రిజర్వ్‌డే రోజు టాస్‌ కూడా మళ్లీ వేస్తారు. కెప్టెన్లు కూడా తమ జట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఈ మ్యాచ్ కోసం మైదానానికి వెళ్లిన అభిమానులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలకు ఈ వర్షం తీరని నష్టం తీసుకొచ్చింది. వర్షం కారణంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు కూడా జరగలేదు. ఇదే వేదికపై ముంబై-గుజరాత్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించినా.. ఆ తర్వాత ఆగిపోవడంతో పూర్తి ఓవర్ల మ్యాచ్‌ జరిగింది.

Story first published: Sunday, May 28, 2023, 21:57 [IST]
Other articles published on May 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+