అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు హడావుడి చేశారు. స్టేడియానికి వచ్చిన తమ అభిమాన జట్టు బస్సును చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ధోనీ ధోనీ అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమానుల గుంపును చూసి షాకైన చెన్నై హెడ్ కోచ్ ఫ్లేమింగ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ ఇతర ఆటగాళ్లు తమ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. మొయిన్ అలీ ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతటి అభిమానాన్ని మరెక్కడా చూడలేమని క్యాప్షన్ ఇచ్చాడు. ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వచ్చిన చెన్నై అభిమానులు.. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మ్యాచ్ వాయిదా పడటంతో వారి ప్లాన్ మొత్తం తలకిందులు అయ్యింది. అర్ధరాత్రి అర్ధంతరంగా హోటల్స్ వెదుక్కోలేక తిప్పలు పడ్డారు. ఈ క్రమంలో చాలా మంది అభిమానులు రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడే రాత్రి అంతా గడిపారు. ప్లాట్‌ఫాంపై పడుకొని నిద్రపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ విషయాన్ని ఓ యూజర్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. అర్ధరాత్రి మూడు గంటలకు తాను రైల్వే స్టేషన్ వెళ్లినట్లు చెప్పిన ఆ యూజర్.. అక్కడ చాలా మంది చెన్నై టీమ్ జెర్సీలు వేసుకొని పడుకొని ఉండటాన్ని చూసినట్లు చెప్పాడు. కొందరు నిద్రపోతుంటే, మరికొందరు మెలకువగానే ఉన్నట్లు తెలిపాడు. వారిని తను పలకరించానని, వాళ్లందరూ కూడా ధోనీని చూడటం కోసం తమిళనాడు నుంచి వచ్చినట్లు చెప్పారని వెల్లడించాడు.
ఆదివారం వర్షం కారణంగా రద్దయిన ఐపీఎల్ ఫైనల్.. సోమవారం నాడు పూర్తిగా జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఎలాంటి మబ్బులు లేవు, వర్షం పడే సూచనలు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ అభిమానుల ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కేలా కనిపిస్తోంది. వీళ్లందరూ ఉత్కంఠ భరితంగా సాగే ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
MS Dhoni is an emotion to the fans.
— myKhel.com (@mykhelcom) May 29, 2023
#IPL2023Finals #CSKvGT #CSKvsGT #GTvCSK #GTvsCSK #IPL2023Final #IPLFinal #IPLFinals #MSDhoni𓃵 #HardikPandya #rain #NarendraModiStadiumpic.twitter.com/0SJuVdDAcX
Chennai Super Kings fans in Narendra Modi Stadium. [Moeen Ali Instagram] pic.twitter.com/FBmKmAy3jy
— Johns. (@CricCrazyJohns) May 29, 2023