Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: జియో సినిమా అత్యంత చెత్త.. ఆ హాట్‌స్టారే నయం.. ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ అధికారిక ఓటీటీ బ్రాడ్ కాస్టర్ 'జియో సినిమా'పై నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులను కనువిందు చేస్తామని ఊదరగొట్టిన జియో సినిమా.. టెక్నికల్ సమస్యలను అధిగమించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల కోసం జియో సినిమా యాప్ ఓపెన్ చేస్తే చుక్కలు కనబడ్డాయని ఆరోపిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంటూ జియో సినిమా యాప్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. జియో సినిమా కంటే హాట్ స్టార్ ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. జియో సినిమా యాప్ లోడింగ్‌కు చాలా టైమ్ తీసుకుంటుందని, 5జీ నెట్ వర్క్ ఇంటర్నేట్ సదుపాయం ఉన్నా.. బఫర్ అవుతుందని ఆరోపిస్తున్నారు.

jio cinema 334

అంతేకాకుండా మధ్య మధ్యలో తెగ యాడ్స్ వస్తున్నాయని, ఇవి చాలా చికాకుకు గురి చేస్తున్నాయని మండిపడుతున్నారు. టెక్నికల్ సమస్యలే కాకుండా ప్రసారం కూడా చాలా నాసిరకంగా ఉందని, భాషపరమైన కామెంట్రీ కూడా వినసొంపుగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆయా భాషల్లోని కామెంటేటర్లు ఇంకా తమ భాషపై పట్టు సాధించలేదని, వారి వ్యాఖ్యానం చాలా ఎబ్బెట్టుగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీడియో క్వాలిటీ కూడా చాలా నాసిరకంగా ఉందంటున్నారు. ప్రస్తుతం జియో సినిమా హ్యాష్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అత్యాధునిక టెక్నాలిజి అందించే కంటే.. యాప్ సాంకేతిక సమస్యలను సరిచేయాలని ఫ్యాన్స్ జియో సినిమాకు చురకలంటిస్తున్నారు.

మరికొందరు మాత్రం జియో సినిమా క్వాలిటీ బాగుందంటున్నారు. ఇంటర్నేట్ సౌకర్యం చెక్ చేసుకోని ఆరోపణలు చేయాలని ట్రోలర్స్‌ను తిప్పికొడుతున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సౌత్ బ్యూటీస్ తమన్నా, రష్మిక తమ డ్యాన్స్‌లతో అభిమానులను అలరించారు. వేడుకల అనంతరం గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే డేవాన్ కాన్వే(1)ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ.. ఐపీఎల్ కెరీర్‌లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

Story first published: Friday, March 31, 2023, 20:10 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+