హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించగా.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(ఓటీటీ) నానా తిప్పలు పడ్డాయి.
ఇన్నాళ్లు స్టార్ స్పోర్ట్సే రెండింటికి అధికారిక బ్రాడ్ కాస్టర్‌గా ఉండగా.. ఈసారి హాట్‌స్టార్‌ను పక్కకు నెట్టి జియో సినిమా రేసులోకి వచ్చింది. దాంతో రెండు సంస్థల మధ్య పోటీ తీవ్రంగా మారింది. లీగ్ క్యాంపైన్ నుంచి ప్రత్యక్ష ప్రసారాల వరకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా రేటింగ్స్ కోసం తగ్గేదేలే అంటూ ఖర్చు చేశాయి.

స్థానిక భాషల్లో ప్రసారమవుతున్న ఈ లీగ్‌లో అక్కడి సూపర్ స్టార్స్‌తో కామెంట్రీ చెప్పించే ప్రయత్నం కూడా స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలు చేశాయి. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చెప్పగా.. భోజ్‌పురి భాషలో అక్కడి మెగాస్టార్, ఎంపీ రవి కిషన్ తన గాత్రంతో వ్యాఖ్యానం అందించాడు.
రవి కిషన్ తెలుగు అభిమానులకు మద్దాలి శివా రెడ్డిగా సుపరిచితమే. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ మూవీ రేసుగుర్రంలో రవి కిషన్ విలన్‌గా మద్దాలి శివారెడ్డి పాత్రను పోషించాడు. 'నన్ను కొట్టేసి వెళ్లిపోయిన తర్వాతైనా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానావాడు. వాడు మామూలోడు కాదు.. వాడింకా చావలేదు. లేవగానే వస్తాడు.. వస్తే ఏసేస్తాడు.'అంటూ అల్లు అర్జున్‌ను హెచ్చరిస్తూ అతను చెప్పిన డైలాగ్ చాలా పాపులర్.
ఆ డైలాగ్ స్థాయిలోనే భోజ్‌పురి భాషలో రవి కిషన్ చెప్పిన వ్యాఖ్యానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భోజ్‌పురి కామెంట్రీ ముందు ఇంగ్లీష్, హిందీ వ్యాఖ్యానం కూడా పనికిరాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రవి కిషన్ కామెంట్రీకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.