For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఆ ముగ్గురు తప్పితే ఆర్‌సీబీలో ఆడేది ఎవడ్రా..?

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌ను గెలుపుతో మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదిరిపోయే ఆటతీరుతో అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన చూసి టైటిల్ నిరీక్షణకు ఈ సారి తెరపడుతుందని అంతా భావించారు. ముంబై ఇండియన్స్‌తో భారీ విజయానంతరం కేకేఆర్, లక్నో చేతిలో ఓడినా.. అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు.

కేకేఆర్‌ చేతిలో చిత్తుగా ఓడినా.. లక్నో‌తో ఆఖరి బంతికి ఓటమిపాలైనా బ్యాడ్‌లక్ అనుకున్నారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో 8 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బలహీనతలు మొత్తం బయటపడ్డాయి.

Virat Kohli And Faf Du Plessis

బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు జట్టు బ్యాటింగ్ మొత్తం ముగ్గురి ఆటగాళ్లపైనే ఆధారపడి ఉందనే విషయం స్పష్టమైంది. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, బిగ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేస్తే ఆర్‌సీబీని ఈజీగా ఓడించవచ్చనే విషయం ప్రత్యర్థి జట్లకు తేలిపోయింది.

మహిపాల్ లోమ్రోర్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమవుతుండటం.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలిగే బిగ్ ఫినిషర్ జట్టులో లేకపోవడం ఆర్‌సీబీకి బలహీనతగా మారింది. గత సీజన్‌లో రజత్ పటీదార్ సూపర్ బ్యాటింగ్‌తో మిడిలార్డర్ బాధ్యతలు మోయగా.. ఈసారి అతను గాయంతో జట్టుకు దూరమవ్వడం.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేకపోవడం ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీస్తోంది.

చెన్నైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఆర్‌సీబీ చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. బిగ్ ఫినిషర్‌గా రాణిస్తాడనుకున్న దినేశ్ కార్తీక్ విఫలమవ్వడం.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సుయాశ్ ప్రభుదేశాయ్ బిగ్ హిట్స్ ఆడకపోవడం ఆ జట్టు పతనాన్ని శాసించింది.

బౌలింగ్‌లో కూడా మహమ్మద్ సిరాజ్ మినహా మరే బౌలర్ ప్రభావం చూపలేకపోతున్నారు. వ్యాన్ పార్నెల్, హసరంగా వికెట్లు తీస్తున్నా ధారళంగా పరుగులిస్తున్నారు. అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన విజయ్ కుమార్ వైశాఖ్ తన బలహీనతలను బయటపెట్టుకున్నాడు. హర్షల్ పటేల్ కూడా కట్టడిగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.

మొత్తానికి చెన్నైతో ఆర్‌సీబీ ప్రదర్శన చూసిన తర్వాత ఈ టీమ్ టైటిల్ దేవుడెరుగు.. ప్లే ఆఫ్స్ చేరినా గొప్పే అనే అభిప్రాయం అభిమానులకు కలుగుతోంది. ప్రతీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్సీ రాణిస్తేనే ఆ జట్టు గెలిచే పరిస్థితి నెలకొంది. 220 పరుగుల స్కోర్‌ను కూడా కాపాడుకోలేని బలహీనమైన బౌలింగ్ లైనప్ ఉంది.

Story first published: Tuesday, April 18, 2023, 18:23 [IST]
Other articles published on Apr 18, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+