Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఓయ్ రోహిత్.. టైటిళ్ల లెక్క బరాబర్! చెన్నై విజయంపై పేలుతున్న మీమ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సంచలన బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు గెలిచి ముంబై ఇండియన్స్ లెక్క సరిచేసింది.

వర్షం కారణంగా అనేక మలుపులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై ఆఖరి బంతికి విజయాన్నందుకోవడాన్ని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు. ముఖ్యంగా అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్దేశించి క్రియేట్ చేసిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ధోనీ, రోహిత్.. టైటిళ్ల లెక్క బరాబర్ అయిందని మాట్లాడుకుంటున్నట్లు మీమ్స్ క్రియేట్ చేశారు.

Fans celebrate with epic memes

ఇక రవీంద్ర జడేజాపై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ రియల్ రవీంద్ర జడేజాని, చెన్నై అభిమానులు అతన్ని అపార్థం చేసుకున్నారని ట్వీట్ చేశారు. మీర్జాపూర్ డైలాగ్స్‌ను జడేజా అన్నట్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు అండగా నిలిచిన సునీల్ గవాస్కర్ రియాక్షన్‌పై కూడా తమదైన శైలిలో జోకులు పేల్చారు. జడేజా ఒక్కడే అసలు సిసలు త్రీడీ ప్లేయరని కామెంట్ చేశారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. డెవాన్ కాన్వే(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), శివమ్ దూబే(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 32), అంబటి రాయుడు(8 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో 19), అజింక్యా రహానే(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, May 30, 2023, 17:18 [IST]
Other articles published on May 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+