Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: ఉప్పల్‌లో ఫేక్ టికెట్స్ కలకలం!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌కు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నకిలీ టికెట్లు, ఫేక్ అక్రిడేషన్ కార్డుల గుర్తించిన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించారు.

టికెట్లు, కార్డ్స్ స్కానింగ్ మెషీన్ల వద్ద భద్రతను మరింత పెంచారు. ముంబై ఇండియన్స్‌తో ఈ నెల 18న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫేక్ టికెట్లు కలకలం రేపాయి. ఈవెంట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వెండర్‌ ఏజెన్నీలో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న కే గోవర్ధన్ రెడ్డి.. బార్‌కోడ్‌ను కాపీచేసి నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేశాడు. దాంతో మ్యాచ్ ఎంట్రీల విషయంలో గందరగోళం నెలకొంది. నకిలీ టికెట్లను తయారు చేస్తున్న ముఠాను గత వారమే ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Uppal Fake Tickets

ఆరుగురిని అరెస్టు చేసి 68 నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాచారం ప్రాంతానికి చెందిన కె.గోవర్ధన్‌రెడ్డి ఈవెంట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వెండర్‌ ఏజెన్సిలో సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్‌ అహ్మద్‌, వంశీ, శ్రవణ్‌కుమార్‌, ఇజాజ్‌ను వ్యాలిడేటర్‌గా నియమించారు. వీరికి జారీ చేసిన అక్రిడిటేషన్‌కార్డులోని బార్‌కోడ్‌ను కాపీ చేసి నకిలీ ఐపీఎల్‌ టికెట్లను తయారు చేయడానికి పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే.

మరోవైపు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనుకుంటోంది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో కోల్‌కతా చిత్తయ్యింది.

Story first published: Thursday, May 4, 2023, 17:44 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+